Share News

AP Elections: సీఎం జగన్ నీటి ప్రాజెక్టులను అటకెక్కించారు: జనసేన నేత కొణతాల రామకృష్ణ

ABN , Publish Date - May 27 , 2024 | 04:30 PM

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతిరాజుని అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా ఆయన విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. సీఎం జగన్ పాలనలో సాగునీటి రంగం పూర్తిగా చతికిలబడిపోయిందని కొణతాల మండిపడ్డారు. ఎన్నికల్లో కూటమి విజయం తధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

AP Elections: సీఎం జగన్ నీటి ప్రాజెక్టులను అటకెక్కించారు: జనసేన నేత కొణతాల రామకృష్ణ

విజయనగరం మే 27: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతిరాజుని అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా ఆయన విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. సీఎం జగన్ పాలనలో సాగునీటి రంగం పూర్తిగా చతికిలబడిపోయిందని కొణతాల మండిపడ్డారు. ఎన్నికల్లో కూటమి విజయం తధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


జగన్ హయాంలో మరుగున పడిన నీటి ప్రాజెక్టులు..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పోలవరం పనులు 72శాతం పూర్తి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు కొణతాల. సీఎం జగన్ హయాంలో పోలవరం పనులు ఒక్క అడుగూ ముందుకు సాగలేదన్నారు. పోలవరం నిర్వాసితులకూ డబ్బులు చెల్లించకుండా వారిని వేధిస్తున్నారన్నారు. ఐదేళ్లుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడిందని.. కనీసం వంశధార, సుజల స్రవంతి ప్రాజెక్టులూ పూర్తి చేయలేకపోయారని ధ్వజమెత్తారు. ఇది జగన్ చేతకాని తనానికి నిదర్శమన్నారు. ప్రాజెక్టులపై జగన్ ఎంత ఖర్చు చేశారో లెక్కలు చూపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెద్దఎత్తున నిధులు కేటాయించి పూర్తి చేస్తామని కొణతాల చెప్పుకొచ్చారు.


ఎన్నికల్లో కూటమి గెలుపు తధ్యం..

జనసేన అధినేత పవన్ కల్యాణ్, కూటమి నేతలు ఆశించిన విధంగానే రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉరకలు వేస్తుందన్నారు. ఎన్నికల వేళ లోక్‌సత్తా పార్టీ సైతం తమకు మద్దతు ప్రకటించిందని, అందుకు జయప్రకాశ్ నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, మేధావులు, రాష్ట్ర ప్రజలంతా తమ వెంటే ఉన్నారని తమ గెలుపును ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:

AP Elections: అడ్డంగా బుక్కైన మంత్రి కాకాణి.. అసలేం జరిగిందంటే..?

Updated Date - May 27 , 2024 | 04:32 PM