Share News

TDP: గజపతినగరంలో టీడీపీ జోరు.. శ్రీనివాస్ దెబ్బకు బొత్స కుటుంబం విలవిల

ABN , Publish Date - May 07 , 2024 | 10:30 AM

ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయనగరం జిల్లా గజపతినగరం(Gajapathinagaram) నియోజకవర్గ రాజకీయాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన గజపతినగరం అంటే సంచలనాలకు మారు పేరు. నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి అన్ని వర్గాల వారిని ఇక్కడి ప్రజలు ఆదరించారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అత్యధికంగా 5 సార్లు గెలుపొందింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తెలుగు దేశం పార్టీ గెలుపు దిశగా దూసుకెళ్తోంది.

TDP: గజపతినగరంలో టీడీపీ జోరు.. శ్రీనివాస్ దెబ్బకు బొత్స కుటుంబం విలవిల

విజయనగరం: ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయనగరం జిల్లా గజపతినగరం(Gajapathinagaram ) నియోజకవర్గ రాజకీయాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన గజపతినగరం అంటే సంచలనాలకు మారు పేరు. నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి అన్ని వర్గాల వారిని ఇక్కడి ప్రజలు ఆదరించారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అత్యధికంగా 5 సార్లు గెలుపొందింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తెలుగు దేశం పార్టీ గెలుపు దిశగా దూసుకెళ్తోంది.

గజపతినగరం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి(కూటమి) కొండపల్లి శ్రీనివాస్(Srinivas Kondapalli) బరిలో ఉన్నారు. ఆయన ఎన్ఆర్ఐ కావడం.. అందులోనూ ఉన్నత చదువులు చదువుకున్న నేత కావడంతో ఆయన గెలుపు ఖాయమేనంటున్నారు స్థానికులు. టీడీపీని గెలిపిస్తే రాష్ట్రం, నియోజకవర్గం అభివృద్ధిపథంలో దూసుకెళ్తుందని ప్రజలు భావిస్తున్నారు. రాజకీయంగానూ ఎంతో చతురత ప్రదర్శించే శ్రీనివాస్ వైసీపీ నుంచి పోటీలో ఉన్న బొత్స అప్పల నర్సయ్యకు చుక్కలు చూపిస్తున్నారు.


అప్పలనర్సయ్య(Botcha Appalanarasayya) 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్‌, వైసీపీ అభ్యర్థిగా బొత్స అప్పలనరసయ్య, కాంగ్రెస్‌ నుంచి గాదాపు కూర్మినాయుడులు 2024 ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. అప్పలనర్సయ్యపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా ఆ పార్టీ మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ కేటయించింది. నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారిన నర్సయ్య గురించి ప్రజలకు వివరిస్తూ.. కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు, తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెబుతూ శ్రీనివాస్ ప్రచారం కొనసాగుతోంది. అటు ప్రచారం నిర్వహిస్తూనే.. మరో వైపు పార్టీని మరింత బలపరిచేందుకు నియోజకవర్గంలో వందల సంఖ్యలో కుటుంబాలను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు.


రానున్నది టీడీపీ ప్రభుత్వమే అని తెలుసుకున్న ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. ఈ మధ్యే కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో గజపతి నగరం పార్టీ కార్యాలయంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు.

దాదాపు వందకుపైగా కుటుంబాలు ఆయన సమక్షంలో ఇప్పటికే టీడీపీలో చేరాయి. అటు సంస్థాగతంగా పార్టీని పటిష్టపరుస్తూ.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తూ.. వైసీపీ అవినీతి, అక్రమాలను ఎండగడుతూ ఆయన ప్రచారం సాగుతోంది. ఎన్నికలకు వారం సమయం కూడా లేకపోవడంతో ఆయన తన ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేశారు.


పార్టీలో చేరిన వారికి భరోసానిస్తూ..

టీడీపీలో ఇప్పటికే వందల సంఖ్యలో చేరుతున్న నేతలకు "భవిష్యత్తు మనదే" అనే భరోసా కల్పిస్తున్నారు శ్రీనివాస్. రాబోయేది తమ ప్రభుత్వమే అని స్పష్టం చేస్తూ.. పార్టీలో చేరుతున్నవారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని సభల్లో చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వైపే ప్రజలు ఉన్నారని.. పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సంక్షేమం రెండు సమాంతరంగా కొనసాగుతాయని వివరిస్తున్నారు.

వైసీపీ పాలన అవినీతి, అక్రమాలను శ్రీనివాస్ ప్రచారంలో ఎండగడుతున్నారు. వైసీపీ వైఫల్యాలు, టీడీపీ మేనిఫెస్టో, నియోజకవర్గ అభివృద్ధి కోసం తమ పార్టీ చేసే పనులను వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గానికి సంబంధించిన అనేక సర్వేల్లో టీడీపీకే సానుకూల పవనాలు ఉన్నట్లు తేలింది. ప్రజలు కూడా వైసీపీ అరాచకాలతో విసిగిపోయారని.. ఈసారి గజపతి నగరంలో టీడీపీ జెండా ఎగరబోతోందని రాజకీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతే ధీమాగా శ్రీనివాస్ ప్రచారంలో దూసుకెళ్తుండటంతో టీడీపీ క్యాడర్‌లో జోష్ పెరిగింది.


గజపతి నగరంలోని మండలాలు

గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, గంట్యాడ మండలాలతో పాటు జామి మండలంలోని 15 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.

ఓటర్లు ఇలా...

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,04,286

పురుషులు1,00,227

మహిళలు 1,04,054

ఇవి కూడా చదవండి...

AP Elections: సీఎస్‌కు ఈసీ ఊహించని ఝలక్.. రంగు పడింది!!

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2024 | 12:45 PM