Share News

Elon Musk: ఎలాన్ మస్క్ ఇండియా పర్యటనలో ట్విస్ట్..ఏం జరిగిందంటే

ABN , Publish Date - Apr 20 , 2024 | 11:27 AM

టెస్లా చీఫ్, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలాన్ మస్క్(Elon Musk) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత పర్యటన వాయిదా పడింది. ఏప్రిల్ 21, 22 తేదీలలో ఎలాన్ మస్క్ భారతదేశ పర్యటన ప్రతిపాదించబడింది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని ఎలాన్ మస్క్ కలవనున్నారు. కానీ అంతలోనే ట్విస్ట్ చోటుచేసుకుంది.

Elon Musk: ఎలాన్ మస్క్ ఇండియా పర్యటనలో ట్విస్ట్..ఏం జరిగిందంటే
tesla ceo Elon Musk India tour visit postponed

టెస్లా చీఫ్, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలాన్ మస్క్(Elon Musk) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత పర్యటన వాయిదా పడింది. ఏప్రిల్ 21, 22 తేదీలలో ఎలాన్ మస్క్ భారతదేశ పర్యటన ప్రతిపాదించబడింది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని ఎలాన్ మస్క్ కలవనున్నారు. ఇప్పటికే టెస్లా సీఈఓ(tesla ceo) ఎలాన్ మస్క్ స్వయంగా ఏప్రిల్ 10న ఎక్స్‌లో ప్రధాని మోదీ(modi)ని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కూడా పోస్ట్ చేశారు. కానీ అంతలోనే ట్విస్ట్ చోటుచేసుకుంది.


తాజాగా ఇండియా టూర్‌(india tour) వాయిదా పడిందని ఎలాన్ మస్క్ స్వయంగా ఓ ట్వీట్ చేస్తూ వెల్లడించారు. టూర్ వాయిదా వేయడానికి గల కారణాన్ని కూడా వివరించారు. ప్రస్తుతం తాను కంపెనీ పనుల్లో చాలా బిజీగా ఉన్నానని మస్క్ తెలిపారు. దురదృష్టవశాత్తూ టెస్లా బాధ్యతల కారణంగా భారతదేశ పర్యటన ఆలస్యమైంది. అయితే ఈ సంవత్సరం చివరిలోపు భారత్ పర్యటన చేస్తానని ఎలోన్ మస్క్ ట్వీట్ చేశారు.


ఎలాన్ మస్క్(elon musk) భారత్(bharat) టూర్ నేపథ్యంలో ఇక్కడ ఫ్యాక్టరీని నిర్మించడానికి 2 నుంచి 3 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటిస్తారని అంచనాలు వెలువడ్డాయి. మస్క్‌తో పాటు కంపెనీకి చెందిన ఇతర అధికారులు కూడా భారతదేశానికి రావచ్చని ఆర్థిక నిపుణులు భావించారు. గతేడాది జూన్‌లో అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని మస్క్ కలిశారు. ఆ సమయంలో మస్క్ 2024లో భారత్‌లో పర్యటించాలని అనుకున్నట్లు చెప్పారు. టెస్లా త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ భారత పర్యటనకు కొన్ని వారాల ముందు ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహన పాలసీని ప్రకటించింది.


ఇది కూడా చదవండి:

Alert: ఈ సేవింగ్ ఖాతాలపై మే 1 నుంచి ఛార్జీలు..ఈ కనీస మొత్తం లేకపోతే


Business Idea: ఉద్యోగానికి బై చెప్పేసి రూ.50,000తో వ్యాపారం.. ఇప్పుడు నెలకు లక్షల్లో ఆదాయం!


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 20 , 2024 | 11:34 AM