Tungabhadra Express: తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని వ్యక్తి మృతి..
ABN , Publish Date - Jul 31 , 2024 | 11:49 AM
రైల్వేస్టేషన్‌లో పట్టాలు దాటుతున్న ప్రయాణికుడిని రైలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)లో మంగళవారం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ అంబేడ్కర్ కాలనీ(Nizamabad Ambedkar Colony)కి చెందిన వెంకట రమణ(45) ప్రైవేట్ ఉద్యోగి. రెండు రోజుల క్రితం హైద్రాబాద్‌కు వచ్చాడు.
సికింద్రాబాద్: రైల్వేస్టేషన్‌లో పట్టాలు దాటుతున్న ప్రయాణికుడిని రైలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)లో మంగళవారం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ అంబేడ్కర్ కాలనీ(Nizamabad Ambedkar Colony)కి చెందిన వెంకట రమణ(45) ప్రైవేట్ ఉద్యోగి. రెండు రోజుల క్రితం హైద్రాబాద్‌కు వచ్చాడు. నిజామాబాద్ తిరిగి వెళ్లేందుకు మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)కు వచ్చాడు.
ఇదికూడా చదవండి: Hyderabad: పెళ్లి పేరుతో యువతిపై అత్యాచారం..
నిజామాబాద్ వైపు వెళ్లే రైలు 8,9 ప్లాట్ ఫాంపై ఉందని అక్కడ నిలుచున్నాడు. తీరా ఆ రైలు 10వ నంబరు ప్లాట్‌ఫాంపై ఉందని తెలుసుకున్నాడు. రైలు బయలుదేరుతుందని భావించి త్వరగా అక్కడికి వెళ్లేందుకు ప్లాట్ ఫాం దిగి పట్టాలు దాటుతుండగా అదే సమయంలో సికింద్రాబాద్‌కు వస్తున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలు(Tungabhadra Express Train) అతన్ని ఢీకొంది. తీవ్రగాయాలతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి జేబులో లభ్యమైన అడ్రస్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు
ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News