Blasts: పెళ్లి వేడుకలో బాంబు పేలుడు.. 18 మంది మృతి, 48 మందికి గాయాలు
ABN , Publish Date - Jun 30 , 2024 | 11:03 AM
ఆఫ్రికా ఖండమైన ఈశాన్య నైజీరియా(Nigeria)లోని బోర్నో రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. పలు చోట్ల చోటుచేసుకున్న బాంబు పేలుళ్లలో(Bomb blasts) 18 మంది మృత్యువాత చెందగా, మరో 48 మంది గాయపడ్డారు.
ఆఫ్రికా ఖండమైన ఈశాన్య నైజీరియా(Nigeria)లోని బోర్నో రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. పలు చోట్ల చోటుచేసుకున్న బాంబు పేలుళ్లలో(Bomb blasts) 18 మంది మృత్యువాత చెందగా, మరో 48 మంది గాయపడ్డారు. ఈ ఘటనలు శనివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరిగాయని అక్కడి మీడియా తెలిపింది. అయితే ఈ పేలుడు ఘటనల్లో మొదటిది వివాహ వేడుకలో సంభవించగా, రెండోది జనరల్ హాస్పిటల్ గ్వోజాలో జరిగిందని, మూడోది అంత్యక్రియల సమయంలో జరిగినట్లు వెల్లడించారు.
ఈ పేలుళ్ల నేపథ్యంలో బోర్నో స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ(sema) డైరెక్టర్ జనరల్ బార్కిండో ముహమ్మద్ సైదు గ్వోజా టౌన్‌లోని ఘటనా స్థలాన్ని సందర్శించారు. బోర్నో స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రకారం మృతుల్లో పురుషులు, మహిళలు, పిల్లలు ఉన్నారని తెలిపింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ బాంబు పేలుళ్ల ఘటనల వెనుక ఎవరు ఉన్నారు. ఉగ్రవాదులే(terrorists) ఈ చర్యలకు పాల్పడ్డారా లేదా ఎవరైనా స్థానికులే ఈ పనిచేశారా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేలుళ్లకు ఎవరు ప్లాన్ చేశారు, ఎందుకనే విషయాలపై సమాచారం సేకరిస్తున్నారు.
గల్ఫ్ ఆఫ్ గినియాలో ఉన్న ఆఫ్రికన్ దేశమైన నైజీరియా(Nigeria)లో 2024 నాటికి 22,91,52,217 మంది జనాభా ఉన్నారు. 2023లో ఇక్కడి జనాభా 223,804,632, 2022 నుంచి 2.41% పెరిగింది. ఇక్కడ ఇంగ్లీష్ ప్రధాన భాషగా ఉంది. ఇది ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం కాగా, ప్రపంచంలో ఆరవ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. నైజీరియా 36 రాష్ట్రాల సముహాం కాగా దీని రాజధాని అబుజా. నైజీరియాలో అతిపెద్ద నగరం లాగోస్, ఇది ప్రపంచంలోని అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటి, ఆఫ్రికాలో అతిపెద్దదిగా ఉంది.
ఇది కూడా చదవండి:
Hardik Pandya: టీ20 ప్రపంచ కప్‌లో హీరోగా హార్దిక్ పాండ్యా..
Stock Markets: సెన్సెక్స్ 80,000కి చేరుకుంటుందా.. నిపుణులు ఏమన్నారంటే
Read Latest International News and Telugu News