Share News

Amit Shah : పోర్ట్‌బ్లెయిర్‌ ఇక శ్రీ విజయపురం

ABN , Publish Date - Sep 14 , 2024 | 03:17 AM

అండమాన్‌ నికోబార్‌ దీవుల రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌ పేరు శ్రీ విజయపురంగా మారింది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం ‘ఎక్స్‌’ ద్వారా ప్రకటించారు.

Amit Shah : పోర్ట్‌బ్లెయిర్‌ ఇక శ్రీ విజయపురం

  • అండమాన్‌ నికోబార్‌ రాజధాని పేరు మార్పు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: అండమాన్‌ నికోబార్‌ దీవుల రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌ పేరు శ్రీ విజయపురంగా మారింది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం ‘ఎక్స్‌’ ద్వారా ప్రకటించారు. దేశంలో వలస పాలన తాలూకూ ఆనవాళ్లను తుడిచివేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పోర్ట్‌బ్లెయిర్‌ పేరులో బ్రిటీష్‌ వారసత్వం ప్రతిబింబిస్తోందని, స్వాత్రం త్య్రం సిద్ధించడంలో ఈ ప్రాంతం కీలక భూమిక వహించినందున విజయానికి ప్రతీకగా ’శ్రీ విజయపురం’ అనే పేరును ఖరారు చేశామని పేర్కొన్నారు. చారిత్రక ప్రాశస్తి కలిగిన ఈ ప్రాంతం... చోళుల కాలంలో నౌవికా స్థావరంగా ఉండేదని, ఇప్పటికీ దేశ వ్యూహాత్మక స్థావరంగా ఉపయోగపడుతోందన్నారు. నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌ తొలిసారిగా మన మువ్వన్నెల పతాకాన్ని ఇక్కడే ఎగురవేశారని. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా వీర్‌ సావర్కర్‌ లాంటి ఎంతో మంది దేశభక్తులు జైలు శిక్షను అనుభవించిన సెల్యూలర్‌ జైలు ఇక్కడే ఉందని పేర్కొన్నారు. కాగా, అండమాన్‌ నికోబార్‌ అనేది 572 దీవుల సమూహం. వీటిలో 38 దీవుల్లో ప్రజలు నివసిస్తున్నారు. అనేక సుందర దీవులకు, బీచ్‌లకు నిలయమైన ఈ ప్రాంతం దేశ పర్యాటకంలోనే అగ్రగామిగా విలసిల్లుతోంది.

Updated Date - Sep 14 , 2024 | 03:17 AM