Budget 2024: మహిళలకు గుడ్ న్యూస్.. ఏకంగా రూ. 3 లక్షల కోట్లు..!
ABN , Publish Date - Jul 23 , 2024 | 01:38 PM
Union Budget 2024: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్‌లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. మహిళలు, బాలికల కేంద్రీకృత పథకాల కోసం ఏకంగా రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ మేరకు మంగళవారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Union Budget 2024: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్‌లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. మహిళలు, బాలికల కేంద్రీకృత పథకాల కోసం ఏకంగా రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ మేరకు మంగళవారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ‘మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాల కోసం ప్రభుత్వం రూ. 3 లక్షల కోట్లకు పైగా కేటాయించడం జరిగింది.’ అని తెలిపారు.
శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు. నిర్ధిష్ట నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఆర్థిక సంవత్సరం 2024 ద్వితీయ త్రైమాసికంలో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు 24 శాతానికి పెరిగిందని చెప్పారు. అంతకు ముందు బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం రూపొందించిన నాలుగు ప్రాధాన్యతల్లో మహిళా సాధికారత కూడా ఒకటన్నారు.
‘మధ్యంతర బడ్జెట్‌లో పేర్కొన్నట్లుగా తాము పేదలు, మహిళలు, యువత, రైతులపై దృష్టిసారించాం.’ అని సీతారామన్ అన్నారు. ఇందులో భాగంగా వర్కింగ్ మహిళల కోసం హాస్టల్స్, క్రెచ్‌లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ తెలిపారు. ‘పరిశ్రమల సహకారంతో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేయడం, క్రెచ్‌ల స్థాపన ద్వారా వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యం పెరిగేలా కృషి చేస్తాం. అలాగే మహిళల నైపుణ్యాభివృద్ధి కోసం నిర్ధిష్ట నైపుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తాం. వుమెన్ ఎస్‌హెచ్‌జి ఎంటర్‌ప్రైజెస్‌కు మార్కెట్ యాక్స్‌స్‌ను ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు చేపడతాం.’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.