Share News

S Jaishankar: డెప్సాంగ్, దెమ్‌చోక్‌లో బలగాల ఉపసంహరణ త్వరలో పూర్తి

ABN , Publish Date - Oct 27 , 2024 | 08:20 PM

చైనాతో చర్చల్లో పురోగతికి సైన్యం, దౌత్య బృందాల కృషి కారణమని జైశంకర్ అన్నారు. ఇటీవల కుదిరిన ఒప్పందంలో భాగంగా దెప్సాంగ్, దమ్‌చోక్‌లో బలగాల ఉపసంహరణ మొదలైందన్నారు. త్వరలోనే ఆ ప్రకియ పూర్తవుతుందని చెప్పారు.

S Jaishankar: డెప్సాంగ్, దెమ్‌చోక్‌లో బలగాల ఉపసంహరణ త్వరలో పూర్తి

ముంబై: తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి పెట్రోలింగ్‌పై చైనా-భారత్ చర్చలు, ఇటీవల ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం పురోగతిని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) అదివారంనాడు వివరించారు. ఒప్పందం ప్రకారం 2020 నాటి పరిస్థితిని పునరుద్ధించాలని నిర్ణయించామని, అతి త్వరలోనే భారత్, చైనా దళాలు ఎల్‌ఎస్‌పీ వద్ద గస్తీ మొదలు పెట్టనున్నాయని తెలిపాయి. డెప్సాంగ్, దెమ్‌చోక్ వద్ద అప్పటి గస్తీ ఏర్పాట్లను పునరుద్ధరిస్తారని భావిస్తున్నామన్నారు. అయితే అందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు.

PM Narendra Modi: డిజిటల్ అరెస్టులపై అవగాహన అవసరం.. 'మన్ కీ బాత్‌'లో మోదీ


ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ, చైనాతో చర్చల్లో పురోగతికి సైన్యం, దౌత్య బృందాల కృషి కారణమని అన్నారు. ఇటీవల కుదిరిన ఒప్పందంలో భాగంగా దెప్సాంగ్, దమ్‌చోక్‌లో బలగాల ఉపసంహరణ మొదలైందన్నారు. త్వరలోనే ఆ ప్రకియ పూర్తవుతుందని చెప్పారు. ఇది మొదటి అడుగు అని, ఆ తర్వాత 2000 పెట్రోలింగ్ స్టాటస్ యథాపూర్వ పరిస్థితికి రావడం రెండో అడుగు అని అన్నారు. కొత్త ఒప్పందం కొన్ని ప్రాంతాలకే పరిమితమైనదని కూడా ఆయన వివరణ ఇచ్చారు. మిగిలిన చోట్ల పరిస్థితులపై చర్చలు జరుగుతున్నట్టు చెప్పారు. అనంతరం విద్యార్థులతో జరిగిన మరో కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, చైనాతో మునుపటి సంబంధాల పునరుద్ధరణ సాధ్యం కావచ్చన్నారు. అయితే దేనికైనా కొంత సమయం పడుతుందని అన్నారు. పరసర్ప విశ్వాసం, కలిసి పనిచేయాలనే ఆసక్తి ఇందుకు దోహదపడతాయని చెప్పారు.


ఉగ్రవాదంపై భారత్ వైఖరి స్పష్టం

ఉగ్రవాదాన్ని భారత్, ప్రపంచ దేశాలు తిప్పికొట్టాల్సిన అవసరాన్ని ముంబై పేలుళ్ల ఘటన చాటిచెప్పిందని జైశంకర్ అన్నారు. యూఎన్ఎస్‌సీ సభ్యదేశంగా భారత్ ఉన్నప్పుడు కౌంటర్ టెర్రరిజం కమిటీకి ప్రెసిడెంట్‌గా ఉన్నామని చెప్పారు. ముంబైలో ఉగ్రదాడులు జరిగిన హోటల్‌లోనే భద్రతా మండలి సమావేశం జరిపిన విషయాన్ని గుర్తుచేశారు. ఉగ్రవాదం విసిరిన పెనుసవాళ్లను ఎవరు ఎదుర్కొంటారని ప్రపంచ దేశాలు ఎదురుచూసినప్పుడు అందరి దృష్టి భారత్‌పైనే నిలిచింది. ఈరోజు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో లీడర్ స్థాయిలో భారత్ ఉంది. ముంబైలో జరిగిన ఘటనలను మళ్లీ పునరావృతం కానీయమని జైశంకర్ అన్నారు.


ఇవి కూడా చదవండి...

Palika Bazar: అనుమానాస్పద ఎలక్ట్రానికి పరికరం స్వాధీనం..ఇదెంత డేంజర్ అంటే

Maharashtra Assembly Elections: 'మహా' ప్రచారంలో బీజేపీ హేమాహేమాలు

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 27 , 2024 | 08:20 PM