Share News

Puja Khedkar: నాపై చర్య తీసుకునే అధికారం యూపీఎస్సీకి లేదు.. కోర్టులో ఖేడ్కర్ వాదన

ABN , Publish Date - Aug 28 , 2024 | 06:41 PM

యూనియన్ పబ్లిక్ సర్వీ్స్ కమిషన్ పై డిస్మిస్డ్ ఐఏఏస్ అధికారి పూజా ఖేడ్కర్ మరోసారి విరుచుకుపడ్డారు. తనపై చర్య తీసుకునే అధికారం యూపీఎస్‌సీకి లేదన్నారు. తాను ఎలాంటి ఫోర్జరీ చేయలేదని, తప్పుడు సమాచారం ఇవ్వలేదని హైకోర్టుకు విన్నవించారు.

Puja Khedkar: నాపై చర్య తీసుకునే అధికారం యూపీఎస్సీకి లేదు.. కోర్టులో ఖేడ్కర్ వాదన

న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీ్స్ కమిషన్ (UPSC)పై డిస్మిస్డ్ ఐఏఏస్ అధికారి పూజా ఖేడ్కర్ మరోసారి విరుచుకుపడ్డారు. తనపై చర్య తీసుకునే అధికారం యూపీఎస్‌సీకి లేదన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాల సమర్పణ వ్యవహారంలో యూపీఎస్‌సీ ఇటీవల ఆమె అభ్యర్థిత్వంపై అనర్హత వేటు వేసింది. భవిష్యత్తులో సర్వీస్ ఎగ్జామ్స్ రాయకుండా డిబార్ చేసింది. క్రిమినల్ కేసు సైతం నమోదు చేసింది. ప్రస్తుతం ఆమె కేసు ఢిల్లీ హైకోర్టు విచారణలో ఉంది. యూపీఎస్‌సీ చేసిన వాదనను కోర్టు విచారణలో పూజ తోసిపుచ్చారు. తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అధికారం యూపీఎస్‌సీకి లేదని తెలిపారు. తాను ఎలాంటి ఫోర్జరీ చేయలేదని, తప్పుడు సమాచారం ఇవ్వలేదని కోర్టుకు విన్నవించారు.


కాగా, మాజీ ఐఏఎస్ ప్రొబేషర్ పూజా ఖేడ్కర్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను యూపీఎస్‌సీ వ్యతిరేకించింది. కమిషన్‌కు, పబ్లిక్‌కు వ్యతిరేకంగా ఆమె ఫ్రాడ్ చేశారని పేర్కొంది. ఇతరుల సహాయం లేకుండా ఇలాంటి అవకతవకలు జరిగి ఉండవని, ఈ ఫ్రాడ్ ఎంత లోతుగా జరిగిందని తెలుసుకోవాలంటే కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని పేర్కొంది. ఆ కారణంగా ముందస్తు బెయిల్‌ అభ్యర్థనను తోసిపుచ్చాలని కోర్టును కోరింది. ఢిల్లీ పోలీసులు సైతం పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చాలని కోర్టును కోరారు. కేసులో మరింత లోతైన దర్యాప్తునకు ముందస్తు బెయిలు అవరోధమవుతుందని వాదించారు.

Supreme Court: మనీలాండరింగ్ కేసుల్లోనూ బెయిల్ వర్తిస్తుంది.. సుప్రీం కీలక వ్యాఖ్యలు


పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని జూలై 31న యూపీఎస్‌సీ రద్దు చేయగా, ఐపీసీ, ఇన్‌పర్ఫేషన్ టెక్నాలజీ యాక్ట్, రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం ఇచ్చేంత వరకూ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును ఖేడ్కర్ కోరారు. దాంతో ఆగస్టు 29 వరకూ ఖేడ్కర్‌కు హైకోర్టు అరెస్టు నుంచి ముందస్తు రక్షణ కల్పించింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 28 , 2024 | 06:41 PM