Share News

Supreme Court: తగినంత సమయం ఇస్తాం.. అందరి వాదనలు వింటాం.. సుప్రీంకోర్టు..

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:37 PM

భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అంటే చాలా కష్టంతో కూడుకున్న ప్రక్రియ. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ప్రతి పోలింగ్ బూత్ లో ఎన్నికలు ( Elections ) సక్రమంగా జరిగేలా చూసుకోవాలి.

Supreme Court: తగినంత సమయం ఇస్తాం.. అందరి వాదనలు వింటాం.. సుప్రీంకోర్టు..

భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అంటే చాలా కష్టంతో కూడుకున్న ప్రక్రియ. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ప్రతి పోలింగ్ బూత్ లో ఎన్నికలు ( Elections ) సక్రమంగా జరిగేలా చూసుకోవాలి. గతంలో బ్యాలెట్ విధానంలో ఎలక్షన్లు జరిగేవి. కానీ మారుతున్న కాలంలో ఈవీఎంలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈవీఎంల పనితీరుపై ప్రతిపక్ష పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈవీఎంలోని ఓట్లతో పాటు వీవీపాట్ స్లిప్పులు కూడా లెక్కించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు.

Delhi Liquor Scam: దిల్లీ మద్యం కేసు.. జైలు నుంచి ఆప్ ముఖ్య నేత విడుదల..

ఈ పిటిషన్ ఈరోజు విచారణకు రావాల్సి ఉన్నా లిస్ట్ నుంచి డిలీట్ కావడంతో ప్రస్తావిస్తున్నానన్నారు. లోకసభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్నందున త్వరగా విచారణ జరపాలని కోరారు. ఇప్పుడు విచారణ జరిపి నిర్ణయం తీసుకోలేకపోతే పిటిషన్ నిరర్ధకం అవుతుందని మరో సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న విషయం కోర్టుకు కూడా తెలుసన్నారు.


వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. వేగంగా విచారణ చేపట్టడానికి తామూ సిద్ధంగానే ఉన్నామని కానీ ఈ వారం విచారణ చేపట్టడం సాధ్యపడదు అని అన్నారు. రెండు వారాల తర్వాత విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. అందరికీ తగినంత సమయం ఇచ్చి అందరి వాదనలు వింటామని వివరించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 03 , 2024 | 01:43 PM