PM Modi: బెంగాల్ ఇక ‘సందర్శన రాజ్య’ నదియా సభలో ప్రధాని మోదీ
ABN , Publish Date - Mar 02 , 2024 | 01:01 PM
పశ్చిమ బెంగాల్ సరైన దిశలో ముందుకెళ్లడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయ పడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బెంగాల్ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదన్నారు.
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ (West Bengal) సరైన దిశలో ముందుకెళ్లడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అభిప్రాయ పడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ (West Bengal) ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదన్నారు. రైల్వేలు రాష్ట్ర చరిత్రలో కీలకం అని వివరించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మరింత అభివృద్ది జరగాల్సింది. సరైన దిశలో రాష్ట్రం ముందుకు నడవలేదని, అందుకే డెవలప్ జరగలేదని పేర్కొన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం బెంగాల్ డెవలప్ మెంట్ కోసం పాటు పడిందని వివరించారు. పశ్చిమ బెంగాల్‌ను ‘సందర్శన రాజ్య’గా మార్చేందుకు అడుగు వేసిందని తెలిపారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు శుక్రవారం నాడు మోదీ పశ్చిమ బెంగాల్ వచ్చారు. అరాంబాగ్‌లో రూ.7 వేల కోట్ల పనులను ప్రారంభించారు. నదియా జిల్లాలో శనివారం (ఈ రోజు) రూ.15 వేల కోట్ల పనులకు ప్రారంభోత్సవం చేశారు. కృష్ణా నగర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం మమతా బెనర్జీ పేరు ఎత్తకుండా విమర్శలు చేశారు. బెంగాల్లో టీఎంసీ అధికారంలో ఉంది. అంతకుముందు కమ్యునిస్టులు పాలించారు. టీఎంసీ, కమ్యునిస్ట్ పార్టీలను పరోక్షంగా ప్రధాని మోదీ విమర్శించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి: BJP: ‘దీదీ’ పార్టీలో గందరగోళం..? అందుకే ప్రధాని మోదీతో స్టేజీ షేర్, బీజేపీ విమర్శలు