Share News

Viral Video: ఏనుగుల ఘీంకారం పవర్ అంటే ఇదీ.. సింహం దాడి నుంచి చిరుతను ఎలా రక్షించాయో చూస్తే..

ABN , Publish Date - May 19 , 2024 | 07:16 PM

అడవికి రాజు ఎవరు అని అనగానే.. టక్కున సింహం పేరే గుర్తకొస్తుంది. సింహాల గాండ్రింపు వినపడితే అడవిలోని అన్ని జంతువులూ పరుగందుకోవాల్సిందే. అయితే అన్నిసార్లు పరిస్థితి ఇలాగే ఉంటుందని అనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు..

Viral Video: ఏనుగుల ఘీంకారం పవర్ అంటే ఇదీ.. సింహం దాడి నుంచి చిరుతను ఎలా రక్షించాయో చూస్తే..

అడవికి రాజు ఎవరు అని అనగానే.. టక్కున సింహం పేరే గుర్తకొస్తుంది. సింహాల గాండ్రింపు వినపడితే అడవిలోని అన్ని జంతువులూ పరుగందుకోవాల్సిందే. అయితే అన్నిసార్లు పరిస్థితి ఇలాగే ఉంటుందని అనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా కూడా జరిగే అవకాశం ఉంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరుతపులిపైకి దాడికి దిగిన సింహం.. ఏనుగుల గాండ్రిపు విని ఏం చేసిందో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సౌత్ ఆఫ్రికాలోని (South Africa) సాబి శాండ్ నేచుర్ రిజెర్వ్ (sabi sand nature reserve) పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వేటను నోట కరుచుకెళ్తున్న చిరుత పులిని (Cheetah) రెండు సింహాలు టార్గెట్ చేస్తాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు చిరుతపులి ఓ చెట్టు ఎక్కుతుంది. అయినా సింహాలు (lions) వదలకుండా చెట్టు వద్దకు వెళ్తాయి.

Viral Video: బీచ్‌లో యువతికి షాక్.. ఎద్దుకు ఆహారం పెట్టాలని చూడగా.. చివరకు..


వాటిలో ఓ సింహం కింద ఉండగా.. మరో సింహం చెట్టు ఎక్కి చిరుతపులిపై దాడి చేయాలని చూస్తుంది. ఈ క్రమంలో చిరుత నోటిలోని వేట కాస్తా కింద పడిపోతుంది. దీంతో దాన్ని కింద ఉన్న సింహం నోట కరుచుకుని వెళ్లిపోతుంది. అయితే చెట్టుపై ఉన్న సింహం.. చిరుతను చంపేయాలని చూస్తుంది. చిరుత పులి కూడా సింహం దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అయినా చిరుతను వదలకుండా సింహం మీద మీదకు వెళ్తుంటుంది. ఈ క్రమంలో దూరం నుంచి ఏనుగుల మంద అటుగా వస్తుంది.

Viral Video: వీళ్లకు పెళ్లంటేనే ఇష్టం లేనట్లుంది.. దండలు మార్చుకుంటున్న వధూవరులను చూస్తే..


సమీపానికి వచ్చే సమయంలో ఏనుగుల ఘీంకార శబ్ధం విన్న సింహం వెనక్కు తిరిగి చూస్తుంది. ఏనుగులు (elephants) సమీపానికి రావడం చూసి భయంతో చెట్టు నుంచి కిందకు దిగి పారిపోతుంది. ఏనుగులు పరుగు పరుగున వచ్చి సింహాన్ని వెంబడించే ప్రయత్నం చేస్తాయి. ఇలా ఏనుగులు చిరుతను సింహం దాడి నుంచి రక్షిస్తాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 60లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: స్నేహితురాలి పెళ్లిలో యువకుడి నిర్వాకం.. వధువుకు గిఫ్ట్ ఇచ్చినట్లు ఇస్తూనే ..

Updated Date - May 19 , 2024 | 07:16 PM