Optical illusion: ఇందులో కనించకుండా దాక్కున్న కుందేలును కనుక్కుంటే.. మీరు తిరుగులేనట్లే..
ABN , Publish Date - Apr 28 , 2024 | 07:23 PM
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు, వీడియోలు.. కాలక్షేపంతో పాటూ మేథస్సు మెరిగేందుకు దోహదం చేస్తాయి. అందులోనూ కొన్ని ఫొటోల్లో తేడాలను కనుక్కోవడం, మరికొన్ని ..
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు, వీడియోలు.. కాలక్షేపంతో పాటూ మేథస్సు మెరిగేందుకు దోహదం చేస్తాయి. అందులోనూ కొన్ని ఫొటోల్లో తేడాలను కనుక్కోవడం, మరికొన్ని ఫొటోల్లో దాక్కున్న వస్తువులు, జంతువులను కనుక్కోవడం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంటుంది. ఇలాంటి పజిళ్లకు సమాధానాలు కనుక్కోవడానికి ప్రయత్నించడం వల్ల మనలో ఏకాగ్రత మరింత పెరుగుతుంది. తాజాగా, ఇలాంటి ఫొటో ఒకదాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడి చిత్రంలో కనిపించకుండా దాక్కున్న కుందేలును కనుక్కోవడానికి ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical illusion viral photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇద్దరు ప్రేమికులు అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. యువకుడు తన పెంపుడు కుక్కను కూడా వెంట తీసుకెళ్తు్న్నాడు. వారి వెను పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆ వృక్షాల మధ్య ఓ నక్క దాక్కుని తొంగి తొంగి చూస్తోంది. అదేవిధంగా వారి పక్కనే ఓ రంగు రంగుల సీతాకోకచిలుక కూడా మనకు కనిపిస్తుంది.
Viral Video: వామ్మో..! ఐడియా మామూలుగా లేదుగా.. ఎండ తగలకుండా ఇంటిని ఏసీగా ఎలా మార్చాడో చూస్తే..
అలాగే అక్కడే ఉన్న ఓ చెట్టుపై గుడ్లగూబ కూడా కనిపిస్తుంది. అయితే ఇంతకు మించి ఇందులో ఎలాంటి జీవులూ మనకు కనిపించవు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ చిత్రంలో ఓ కుందేలు (rabbithiding in the forest) కూడా దాక్కుని ఉంది. దాన్ని గుర్తించడం కష్టమైనా.. రోజూ చెప్పుకొన్నట్లే.. కాస్త తీక్షణంగా పరిశీలిస్తే కనిపెట్టడం చాలా సులభం. ఇంకెందుకు ఆలస్యం.. ఆ కుందేలు ఎక్కడ దాక్కుందో కనిపెట్టడం మరి. ఒకవేళ ఇప్పటికీ మీకు కుందేలును గుర్తించడం కష్టంగా ఉంటే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.