Kanuma: కనుమ విశిష్టత ఇదే..! అందుకే పశువులను పూజిస్తారు..?
ABN , Publish Date - Jan 16 , 2024 | 09:26 AM
భోగితో మొదలై సంక్రాంతితో సందడిగా మారుతుంది. మూడో రోజు కనుమతో సంక్రాంతి సంబరాలు ముగుస్తాయి. ప్రాంతాన్ని బట్టి కనుమకు ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్లో కనుమ రోజున నోరూరించే నాన్ వెజ్ వంటకాలు చేసుకుంటారు.
హైదరాబాద్: సంక్రాంతి (Sankranthi) సంబరాల్లో చివరి పండగ కనుమ. భోగితో మొదలై సంక్రాంతితో సందడిగా మారుతుంది. మూడో రోజు కనుమతో (Kanuma) సంక్రాంతి సంబరాలు ముగుస్తాయి. ప్రాంతాన్ని బట్టి కనుమకు (Kanuma) ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) కనుమ (Kanuma) రోజున నోరూరించే నాన్ వెజ్ వంటకాలు చేసుకుంటారు. కనుమను (Kanuma) పశువుల పండగ అని కూడా పిలుస్తారు.
పశువుల అలంకరణ
కనుమ (Kanuma) రోజున ఉదయాన్నే ఆవు, ఎద్దులకు స్నానం చేయించి పసుపు, కుంకుమ పెడతారు. మెడల్లో గజ్జెల పట్టి, కాళ్లకు మువ్వలు వేస్తారు. కొమ్ములను పదును చేస్తుంటారు. రంగు రంగుల కాగితాలు, రిబ్బన్లను కొమ్ములకు అలంకరిస్తారు. పశవులు ఒంటి మీద బిళ్లలతో తయారుచేసిన వస్త్రాలను వేస్తారు. కనుమ రోజున కూడా పల్లెల్లో కోడి పందాలు, ఎద్దుల పోటీలను నిర్వహిస్తారు.
గారెలు, మాంసం
చనిపోయిన పెద్దలు బయటకు వస్తారని విశ్వసిస్తారు. వారిని తలచుకొని ప్రసాదాలు పెట్టాలని ఆచారం ఉంది. గారెలు, మాంసం వంటకాలు చేసి పెద్దలకు పెడతారు. పెద్దల కోసం భోజనం తయారు చేసి, అందరూ కలిసి తినాలనే నియమం ఉంది. అక్కాచెల్లెళ్లు, అల్లుళ్లతో కలిసి కనుమ పండుగ చేసుకుంటారు. కనుమను ముక్కనుమ అని పిలుస్తారు. ఈ రోజున ముక్క ఆరగించాలనే సంప్రదాయం ఉంది. ఏపీలో కనుమ రోజున మాంసాహారం తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల సంక్రాంతి రోజున మాంసాహారం తీసుకుంటారు. కనుమ రోజున పెద్దలను తలచుకుని, బంధుమిత్రులతో గడిపి విశ్రాంతి తీసుకుంటారు.
ప్రయాణం చేయొద్దు..?
కనుమ మరుసటి రోజు ప్రయాణించాలని పెద్దలు చెబుతారు. కనుమ రోజు కాకి కూడా కదలదు అనే సామెత ఉంది. అత్యవసరం అయితే వెళ్లొద్దని చెబుతారు. కాదని ప్రయాణిస్తే ఆటంకాలు తప్పవని పెద్దలు హెచ్చరిస్తారు. కనుమ రోజున మినుమలు తినాలి అనే సామెత ఉంది. చలికాలంలో ఒంట్లో తగినంత వేడి పెంచేందుకు మినుమలు ఉపయోగ పడతాయి. ఆరోగ్యం కోసం ఆహార పదార్థాలు తీసుకోవాలని చెబుతారు. కనుమ పండగతో సంక్రాంతి సంబరాలు అంతగా ముగుస్తాయి.
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.