Share News

SMAT 2024: పాండ్యా బ్రదర్స్‌ను భయపెట్టిన సీఎస్‌కే బౌలర్.. ఐపీఎల్‌ రైవల్రీ షురూ

ABN , Publish Date - Dec 03 , 2024 | 05:51 PM

SMAT 2024: పాండ్యా బ్రదర్స్‌ను ఫేస్ చేయాలంటే చాలా మంది బౌలర్లు భయపడతారు. భారీ షాట్లతో తమ మీద విరుచుకుపడతారేమోనని టెన్షన్ పడతారు. కానీ ఓ సీఎస్‌కే బౌలర్ మాత్రం హార్దిక్-కృనాల్‌ను భయపెట్టాడు.

SMAT 2024: పాండ్యా బ్రదర్స్‌ను భయపెట్టిన సీఎస్‌కే బౌలర్.. ఐపీఎల్‌ రైవల్రీ షురూ

పాండ్యా బ్రదర్స్‌ను ఫేస్ చేయాలంటే చాలా మంది బౌలర్లు భయపడతారు. భారీ షాట్లతో తమ మీద విరుచుకుపడతారేమోనని టెన్షన్ పడతారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా తమను ఉతికి ఆరేస్తాడని ఆందోళన చెందుతారు. అతడి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆచోచిస్తూ ఉంటారు. అయితే ఓ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మాత్రం పాండ్యా సోదరులను భయపెట్టాడు. ఛాలెంజ్‌గా తీసుకొని బౌలింగ్ చేసి అదరగొట్టాడు. పాండ్యా బ్రదర్స్‌ను వరుస బంతుల్లో ఔట్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇంతకీ ఎవరా బౌలర్? ఏ టోర్నీలో ఈ మ్యాజిక్ చేశాడు? అనేది ఇప్పుడు చూద్దాం..


సున్నాకే పెవిలియన్‌కు..

కర్ణాటక లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ అద్భుతం చేసి చూపించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా బరోడాతో మ్యాచ్‌లో అతడు అదరగొట్టాడు. వరుస బంతుల్లో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాను వెనక్కి పంపిన శ్రేయస్.. ఆ తర్వాతి బాల్‌కు భాను పానియాను కూడా ఔట్ చేశాడు. దీంతో ఈ టోర్నమెంట్ హిస్టరీలో హ్యాట్రిక్ నమోదు చేసిన అతికొద్ది మంది బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ స్నిన్నర్ దెబ్బకు పాండ్యా సోదరులిద్దరూ 0 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే శ్రేయస్ గోపాల్ బచ్చా ప్లేయరేమీ కాదు. ఈ ఆల్‌రౌండర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 87 మ్యాచుల్లో 3546 పరుగులు చేశాడు. అలాగే 251 వికెట్లు పడగొట్టాడు.


చెన్నై ఫ్యాన్స్ హ్యాపీ

డొమెస్టిక్ క్రికెట్‌లో తోపు ఆల్‌రౌండర్‌గా పేరున్న శ్రేయస్ గోపాల్.. ఐపీఎల్‌తో మంచి క్రేజ్ సంపాదించాడు. ఇప్పటిదాకా క్యాష్ రిచ్ లీగ్‌లో 49 మ్యాచుల్లో 49 వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇటీవల నిర్వహించిన మెగా ఆక్షన్‌లో రూ.30 లక్షలు చెల్లించి అతడ్ని సొంతం చేసుకుంది సీఎస్‌కే. వచ్చే సీజన్ కోసం ఎదురు చూస్తున్న గోపాల్.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో చెలరేగుతున్నాడు. ఈ టోర్నీలో ఆడిన 6 మ్యాచుల్లో కలిపి 14 వికెట్లు పడగొట్టాడు. దీంతో చెన్నై ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. వరుస బంతుల్లో హార్దిక్‌, కృనాల్‌ను ఔట్ చేసి ముంబై ఇండియన్స్, ఆర్సీబీకి అతడు హెచ్చరికలు పంపాడని అంటున్నారు. ఐపీఎల్‌లో రైవల్రీ తప్పదని కామెంట్స్ చేస్తున్నారు.


Also Read:

జైస్వాల్‌పై రోహిత్ సీరియస్.. ఎందుకిలా చేశావ్ అంటూ..

ఈ క్యాప్ విలువ 2 కోట్లు.. సచిన్, కోహ్లీది కాదు.. ఏ ప్లేయర్‌దో చెప్పండి చూద్దాం

70 వేల కోట్లకు వారసుడు.. 22 ఏళ్లకే రిటైర్మెంట్

For More Sports And Telugu News

Updated Date - Dec 03 , 2024 | 05:55 PM