Share News

Cricket: క్రికెట్ హిస్టరీలో సంచలనం.. బాప్‌రే.. 1,082 మ్యాచ్‌లు, 5 లక్షల రన్స్.. ఎవరంటే..

ABN , Publish Date - Dec 07 , 2024 | 08:17 PM

Cricket: క్రికెట్ చరిత్రలోనే సంచలనం నమోదైంది. ఆ రికార్డు గురించి తెలిస్తే ఎవ్వరైనా బాప్‌రే అనాల్సిందే. అసలు ఎవ్వరికీ సాధ్యం కాని ఆ రికార్డు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Cricket: క్రికెట్ హిస్టరీలో సంచలనం.. బాప్‌రే.. 1,082 మ్యాచ్‌లు, 5 లక్షల రన్స్.. ఎవరంటే..

క్రికెట్‌లో ఎన్నో రికార్డులు ఉన్నాయి. మైల్‌స్టోన్స్ అంటే ప్లేయర్లతో పాటు అభిమానుల్లో కూడా చాలా ఎగ్జయిట్‌మెంట్ ఉంటుంది. తమకు ఇష్టమైన జట్టు, అందులోని ఆటగాళ్లు సాధించే రికార్డుల గురించి తెలుసుకొని సంబురపడుతుంటారు ఫ్యాన్స్. అయితే జెంటిల్మన్‌ గేమ్‌లో ఈ మధ్య రికార్డులను బద్దలుకొట్టడం అనేది కామన్ అయిపోయింది. ఒకప్పటిలా కాకుండా ఆటలో వేగం పెరగడంతో పాత రికార్డులకు పాతర వేస్తున్నారు ప్లేయర్లు. ఈ క్రమంలోనే తాజాగా ఓ సెన్సేషనల్ రికార్డు నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత సంచలనంగా మారిన ఈ రికార్డు ఏంటి? దాన్ని ఎవరు నమోదు చేశారనేది ఇప్పుడు చూద్దాం..


తొలి జట్టుగా..

క్రికెట్‌కు పుట్టినిల్లుగా చెప్పే ఇంగ్లండ్ టీమ్ ఓ అరుదైన ఘనతను తన అకౌంట్‌లో వేసుకుంది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ హిస్టరీలో 5 లక్షలకు పైగా రన్స్ చేసిన తొలి జట్టుగా ఇంగ్లీష్ టీమ్ అవతరించింది. ఆ టీమ్‌కు ఇది ఓవరాల్‌గా 1,082వ టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. పరుగుల జాబితాలో ఇంగ్లండ్ తర్వాతి స్థానంలో డేంజరస్ ఆస్ట్రేలియా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు లాంగ్ ఫార్మాట్‌లో 4,28,868 రన్స్ చేసింది. అదే టీమిండియా 2,78,751 పరుగులతో థర్డ్ పొజిషన్‌లో కంటిన్యూ అవుతోంది. కాగా, న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో ఈ రేర్ ఫీట్‌ను అందుకున్న ఇంగ్లండ్.. మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఆ టీమ్ లీడ్ 533 పరుగులకు చేరుకుంది.


Also Read:

ఆసీస్‌ను ఆపేందుకు పిచ్చోడ్ని దింపుతున్న రోహిత్.. ఆశలన్నీ అతడి పైనే..

నేను చెప్పిందొకటి.. సిరాజ్‌కు అర్థమైందొకటి: ట్రావిస్ హెడ్

జైస్వాల్‌పై గిల్ సీరియస్.. వినిపించడం లేదా అంటూ..

అంపైర్‌తో గొడవకు దిగిన కోహ్లీ.. ప్రూఫ్స్ చూపించి మరీ..

For More Sports And Telugu News

Updated Date - Dec 07 , 2024 | 08:17 PM