Share News

Siraj vs Labuschagne: లబుషేన్‌ను మళ్లీ గెలికిన సిరాజ్.. గ్రౌండ్‌లో స్టార్ల రచ్చ

ABN , Publish Date - Dec 15 , 2024 | 09:10 AM

Siraj vs Labuschagne: గబ్బా టెస్ట్ రెండో రోజు గ్రౌండ్‌లో రచ్చ జరిగింది. అటు భారత స్టార్లు, ఇటు ఆసీస్ ప్లేయర్లు ఢీ అంటే ఢీ అనడంతో వాతావరణం హీటెక్కింది.

Siraj vs Labuschagne: లబుషేన్‌ను మళ్లీ గెలికిన సిరాజ్.. గ్రౌండ్‌లో స్టార్ల రచ్చ
Mohammed Siraj

IND vs AUS: గబ్బా టెస్ట్ రెండో రోజు గ్రౌండ్‌లో రచ్చ జరిగింది. అటు భారత స్టార్లు, ఇటు ఆసీస్ ప్లేయర్లు ఢీ అంటే ఢీ అనడంతో వాతావరణం హీటెక్కింది. వికెట్లు పడిన సమయాల్లో టీమిండియా ఆటగాళ్లు చాలా ఉద్వేగంతో కనిపించారు. మొదటి రెండు టెస్టుల్లో సిరాజ్ వర్సెస్ లబుషేన్, సిరాజ్ వర్సెస్ హెడ్, కోహ్లీ వర్సెస్ లబుషేన్, బుమ్రా వర్సెస్ లబుషేన్ ఫైట్స్ సిరీస్‌లో హీట్ పుట్టించాయి. బ్రిస్బేన్‌లోనూ అదే రిపీట్ అయింది. అడిలైడ్ టెస్ట్ గొడవను మర్చిపోని సిరాజ్.. మళ్లీ లబుషేన్‌ను గెలికాడు. అతడ్ని రెచ్చగొట్టాడు మియా.


బెయిల్స్ మార్చి..

వరుసగా స్టన్నింగ్ డెలివరీస్‌తో లబుషేన్‌ను ఇబ్బంది పెట్టాడు లబుషేన్. బౌలింగ్ వేస్తూనే అతడ్ని ఏదో ఒకటి అంటూ గెలికాడు. ఆసీస్ బ్యాటర్ కూడా సిరాజ్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. ఇద్దరూ తగ్గకపోవడంతో వాతావరణం హీటెక్కింది. ఇదే క్రమంలో ఓ బాల్‌ వేశాక వికెట్ల వద్దకు వెళ్లిన హైదరాబాదీ పేసర్.. కిందపడిన బెయిల్స్‌ను సెట్ చేశాడు. లబుషేన్‌ను చూస్తూ సీరియస్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో లబుషేన్ కావాలని బెయిల్స్‌ పొజిషన్‌ను మార్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. చిన్న పిల్లల్లా కొట్లాడుతున్నారు అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన కంగారూలు ప్రస్తుతం 3 వికెట్లకు 139 పరుగులతో ఉన్నారు. స్టీవ్ స్మిత్ (38 నాటౌట్), ట్రావిస్ హెడ్ (39 నాటౌట్) క్రీజులో ఉన్నారు.


Also Read:

57 ఏళ్ల తర్వాత..

నా పెళ్లికి రండి

ఫైనల్లో భారత్‌ X చైనా

For More Sports And Telugu News

Updated Date - Dec 15 , 2024 | 09:16 AM