Share News

MI vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్.. తుది జట్టులో కీలక మార్పు!

ABN , Publish Date - Apr 01 , 2024 | 07:11 PM

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాయిన్ వేయగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ హెడ్స్ చెప్పాడు. కాయిన్ కూడా హెడ్స్ పడింది. టాస్ గెలిచిన శాంసన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.

MI vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్.. తుది జట్టులో కీలక మార్పు!

ముంబై: ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు(Mumbai Indians vs Rajasthan Royals) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) కాయిన్ వేయగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) హెడ్స్ చెప్పాడు. కాయిన్ కూడా హెడ్స్ పడింది. టాస్ గెలిచిన శాంసన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో ముంబై ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. పేస్ బౌలర్ సందీప్ శర్మ ఫిట్‌గా లేకపోవడంతో అతని స్థానంలో బర్గర్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్టు శాంసన్ చెప్పాడు.

ఇక ముంబై ఇండియన్స్ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి సీజన్‌లో బోణీ చేయాలని ముంబై భావిస్తోంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానంలో ఉంది. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 28 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అత్యధికంగా ముంబై 15 మ్యాచ్‌ల్లో గెలవగా.. రాజస్థాన్ 12 మ్యాచ్‌ల్లో గెలిచింది.


తుది జట్లు

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, జస్ప్రీత్ బుమ్రా, క్వేనా మఫాకా

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్/కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాండ్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: ముంబైతో మ్యాచ్‌లో చరిత్ర సృష్టించనున్న అశ్విన్.. ఆ రికార్డు సాధించిన తొలి బౌలర్‌గా..

IPL 2024: ఐపీఎల్‌లో ఆ రోజు జరగాల్సిన బిగ్ మ్యాచ్‌పై నీలి నీడలు.. ఎందుకంటే..


Updated Date - Apr 01 , 2024 | 07:16 PM