Share News

Jhulan Goswami: నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి ఒక కొత్త మెంటార్‌గా భారతీయ లెజెండ్‌

ABN , Publish Date - Jul 13 , 2024 | 12:01 PM

టీమిండియా మాజీ మహిళా ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి(Jhulan Goswami) అరుదైన ఘనతను దక్కించుకున్నారు. మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి.. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (TKR)లో మెంటార్‌గా చేరారు.

Jhulan Goswami: నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి ఒక కొత్త మెంటార్‌గా భారతీయ లెజెండ్‌
Indian legend Jhulan Goswami

టీమిండియా మాజీ మహిళా ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి(Jhulan Goswami) అరుదైన ఘనతను దక్కించుకున్నారు. మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి.. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (TKR)లో మెంటార్‌గా చేరారు. 20 ఏళ్ల పాటు సాగిన అంతర్జాతీయ కెరీర్‌లో గోస్వామి 2022లో రిటైరయ్యే వరకు భారత్ తరపున అన్ని ఫార్మాట్లలో ఆడి 355 వికెట్లు పడగొట్టడం విశేషం. 2021లో ప్రారంభమైన WCPL సీజన్‌లో TKR మహిళలను ఛాంపియన్‌షిప్ టైటిల్‌కు నడిపించిన స్టార్ ఆల్ రౌండర్ డియాండ్రా డాటిన్ నేతృత్వంలోని జట్టుకు గోస్వామి మెంటార్ పాత్రలో కనిపించనుంది.


అలాంటి నాణ్యమైన ఫ్రాంచైజీతో సంబంధం కలిగి ఉండటం గౌరవంగా భావిస్తున్నానని కోల్‌కతా మాజీ ఫాస్ట్ బౌలర్ గోస్వామి ఈ మేరకు వెల్లడించారు. WCPLలో TKR ఉమెన్‌లో చేరడం ఆనందంగా ఉంది. నన్ను మెంటార్‌గా భావించినందుకు KKR మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు. నేను నిజంగా ఈ టోర్నమెంట్ కోసం ఎదురుచూస్తున్నానని గోస్వామి పేర్కొన్నారు. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా గోస్వామి 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్ కోచ్‌గా ఉన్నారు.


TKR కెప్టెన్సీ వెస్టిండీస్ డియాండ్రా డాటిన్ చేతిలో ఉంది. TKR ఈసారి తన జట్టులో జెమిమా రోడ్రిగ్స్, శిఖా పాండే, మెగ్ లానింగ్, జెస్ జాన్సన్‌లను కూడా చేర్చుకుంది. ఈ నలుగురు ఆటగాళ్లు WPLలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడతారు. WCPL 2024 ఆగస్టు 21 నుంచి ఆగస్టు 29 వరకు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ టీకేఆర్‌తో పాటు బార్బడోస్ రాయల్స్, గయానా అమెజాన్ వారియర్స్ ఈ టోర్నీలో భాగం కానున్నాయి. ఈ టోర్నీలో మొత్తం ఏడు మ్యాచ్‌లు జరగనుండగా, అవన్నీ ట్రూబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో జరుగుతాయి.


ఇవి కూడా చదవండి..

Virat Kohli: ఆ ఫొటో కోసం రోహిత్‌ను కోహ్లీ ఎలా బతిమాలుతున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!


Pakistan: కోహ్లీ పాకిస్తాన్ వస్తే.. భారత్‌ను మర్చిపోతాడు.. పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రీది ఆసక్తికర వ్యాఖ్యలు!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 13 , 2024 | 12:05 PM