Hyderabad: హరీష్‌రావును జైలుకు పంపించే వరకు ఉద్యమం..
ABN , Publish Date - Jun 14 , 2024 | 11:12 AM
సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు(Former minister Harish Rao) ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరేందుకు యత్నిస్తున్నాడని, సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చక్రధర్ గౌడ్(Chakradhar Goud) అన్నారు.
- ఆయన త్వరలో బీజేపీలో చేరతాడు: సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రధర్‌గౌడ్
హైదరాబాద్: సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు(Former minister Harish Rao) ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరేందుకు యత్నిస్తున్నాడని, సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చక్రధర్ గౌడ్(Chakradhar Goud) అన్నారు. శుక్రవారం తార్నాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చక్రధర్‌గౌడ్ మాట్లాడుతూ.. ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న హరీష్‌రావు తన మాటకు కట్టుబడి ఉండాలని సవాల్ విసిరారు.
ఇదికూడా చదవండి: మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదైంది: రఘునందన్
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా హరీష్ రావు ఇప్పటికే బీజేపీ(BJP) జాతీయ నాయకులతో మంతనాలు జరుపుతున్నాడని, త్వరలో ఆయన బీజేపీలో చేరుతాడని తెలిపారు. రంగనాయక సాగర్ భూముల విషయంలో హరీష్‌రావు పాల్పడిన అక్రమాలను తాను బయటపెడుతున్నానని, గతంలో తనపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని, హరీష్‌రావును జైలుకు పంపించే వరకు తన ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News