Share News

BJP: త్వరలో కవిత జైలుకు.. కేంద్రమంత్రి అశ్విని చౌబే కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 23 , 2024 | 10:25 PM

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలో జైలుకు వెళ్లబోతుందని కేంద్ర పౌర సరఫరాలు, అటవీ, పర్యావరణ శాఖల సహాయ మంత్రి అశ్విని చౌబే(Ashwini Choubey ) హెచ్చరించారు. శుక్రవారం బీహెచ్‌ఈఎల్ - లింగంపల్లి చౌరస్తా నుంచి బీజేపీ విజయ్ సంకల్ప యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు.

BJP: త్వరలో కవిత  జైలుకు.. కేంద్రమంత్రి అశ్విని చౌబే కీలక వ్యాఖ్యలు

సంగారెడ్డి జిల్లా: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలో జైలుకు వెళ్లబోతుందని కేంద్ర పౌర సరఫరాలు, అటవీ, పర్యావరణ శాఖల సహాయ మంత్రి అశ్విని చౌబే(Ashwini Choubey ) హెచ్చరించారు. శుక్రవారం బీహెచ్‌ఈఎల్ - లింగంపల్లి చౌరస్తా నుంచి బీజేపీ విజయ్ సంకల్ప యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అశ్విని చౌబే మాట్లాడుతూ... ఇండియా కూటమి పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రజల ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశాన్ని ముక్కలు చేసేందుకు వారు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.

అలా చేస్తే.. రాహుల్ గాంధీ దేశాన్ని అమ్మేస్తారు

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి కుర్చీ కావాలంట..కుర్చీ ఇస్తే దేశాన్ని అమ్మేస్తారని దెప్పిపొడిచారు. కేరళ నుంచి పార్లమెంటుకు పంపితే ఒక్క రోజు కూడా ప్రజల కోసం పనిచేయలేదని అన్నారు. ‘రాహుల్ ది భారత్ జోడో యాత్ర కాదని... భారత్ తోడోయాత్ర’ అని విమర్శించారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వలో దేశం భిన్నత్వంలో ఏకత్వంలా నిలుస్తోందని తెలిపారు. భారత్ న్యాయ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ కోట్లు వెనకాల వేసుకుంటున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పదని అన్నారు. ‘భారత్ న్యాయ యాత్ర కాదు.. జైల్ యాత్ర కాబోతుంది’ అని ఆక్షేపించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మీన మేషాలు లెక్కిస్తోందని మంత్రి అశ్విని చౌబే ఎద్దేవా చేశారు.

Updated Date - Feb 23 , 2024 | 10:25 PM