Share News

Kavitha: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకానున్న కవిత

ABN , Publish Date - Aug 28 , 2024 | 09:24 AM

Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై ట్రయల్లో భాగంగా నేడు విచారణ జరుగనుంది. ప్రస్తుతం వసంత్ విహార్‌లోని పార్టీ కార్యాలయంలో కవిత బసచేశారు. తనను కలవడానికి వచ్చే పార్టీ నేతలను కలిసి మధ్యాహ్నం హైదరాబాద్‌కు కవిత బయలుదేరనున్నారు.

Kavitha: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకానున్న కవిత
BRS MLC Kavitha

న్యూఢిల్లీ, ఆగస్టు 28: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam) విచారణకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై ట్రయల్లో భాగంగా నేడు విచారణ జరుగనుంది. ప్రస్తుతం వసంత్ విహార్‌లోని పార్టీ కార్యాలయంలో కవిత బసచేశారు. తనను కలవడానికి వచ్చే పార్టీ నేతలను కలిసి మధ్యాహ్నం హైదరాబాద్‌కు కవిత బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ పయనంకానున్నారు. సాయంత్రం 4:45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో లాండ్ అవుతారు. ఈ సందర్భంగా కవితకు ఘనంగా స్వాగతం పలికేందుకు భారత జాగృతి ఏర్పాట్లు చేసింది. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా తన నివాసానికి కవిత చేరుకోనున్నారు.

KCR : బిడ్డా.. ఎట్లున్నవ్‌



కాగా.. గత ఐదు నెలలకుపైగా తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి నమోదైన మనీలాండరింగ్‌, అవినీతి కేసుల్లో ఆమెకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. విచారణ సందర్భంగా.. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీల తీరును అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. నిందితుల్లో ఇష్టానుసారంగా కొందరిని ఎంపిక చేసుకొని అప్రూవర్లుగా మార్చుకోవటం ఏమిటని ప్రశ్నించింది. అలాగే, మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 45(1) కింద మహిళలకు బెయిల్‌ మంజూరు చేసే నిబంధనను.. కవిత రాజకీయ నాయకురాలు అయినందున వర్తింపజేయలేమన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఏ స్థానంలో ఉన్నా మహిళ.. మహిళేనని పేర్కొంది. ఈ మేరకు, బెయిల్‌ ఇవ్వటానికి నిరాకరిస్తూ హైకోర్టు జూలై 1వ తేదీన ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను ఆమోదిస్తూ బెయిల్‌ మంజూరు చేసింది.

Earthquake: శ్రీకాకుళంలో తెల్లవారుజామున స్వల్ప భూకంపం..


రెండు కేసుల్లోనూ రూ.10 లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని, పాస్‌పోర్టును విచారణ కోర్టు న్యాయమూర్తి వద్ద డిపాజిట్‌ చేయాలని, సాక్షులను ప్రభావితం చేయడం కానీ బెదిరించడం కానీ చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు విచారణలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని పేర్కొంది. సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో, స్థానిక ఢిల్లీ కోర్టు జైలు నుంచి కవిత విడుదలకు అనుమతిస్తూ రిలీజ్‌ వారెంట్లను జారీ చేసింది. దీంతో తిహాడ్‌ జైలు నుంచి కవిత విడుదలయ్యారు.


ఇవి కూడా చదవండి...

Atal Setu: 7 నెలల్లో 50 లక్షలు.. అటల్ సేతు రికార్డ్

Nagpur: నగదు కోసం శిశువు విక్రయం: ఆరుగురు అరెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 28 , 2024 | 09:27 AM