Rain Alert: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు..
ABN , Publish Date - Oct 01 , 2024 | 06:33 PM
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్ సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
హైదరాబాద్: నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. అలాగే పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్ ర్పేట్, ఎస్ఆర్ నగర్, టోలిచౌకి, మెహదీపట్నం, షేక్ పేట్, అత్తాపూర్, లంగర్ హౌస్, మణికొండలో వర్షం దంచి కొడుతోంది. దీంతో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వర్షపు నీటికి రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. నాన్ స్టాప్‌గా వరుణుడు విజృంభిస్తుండడంతో వాహనదారులు మెట్లోస్టేషన్ల కింద తలదాచుకున్నారు. మరికొంతమంది తమ వాహనాలను వదిలేసి షాపింగ్ మాల్స్‌లోకి దూరారు. మరో గంటపాటు భారీ వర్షం కురవనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Hyderabad: హైదరాబాద్ పోలీసుల నయా రూల్స్.. మతపరమైన కార్యక్రమాల్లో డీజేలు పెడితే..
Hyderabad: అశ్లీల వీడియోలు చూస్తే ఇకపై జైలుకే.. అలాంటి వారిపై కన్నేసిన నిఘా సంస్థలు..
Musi: మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు షురూ
Read Latest Telangana News And Telugu News