Share News

Rain: ఈ వర్షాన్ని చూస్తే.. ‘వాహ్ క్యా రేన్ హే’ అనకుండా ఉండరు మరి!

ABN , Publish Date - Aug 23 , 2024 | 01:19 PM

Telangana: హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలతో నగరవాసులు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియక సతమతమవుతున్న పరిస్థితి. ఇదిలా ఉండగా... భాగ్యనగరంలో ఓ చోట కురిసిన వర్షాన్ని చూస్తే మాత్రం...‘‘వాహ్ క్యా రేన్ హే’’ అని అనకుండా ఉండరు మరి.

Rain: ఈ వర్షాన్ని చూస్తే.. ‘వాహ్ క్యా రేన్ హే’ అనకుండా ఉండరు మరి!
Hyderabad Rain

హైదరాబాద్, ఆగస్టు 23: హైదరాబాద్‌లో (Hyderabad) కురుస్తున్న వర్షాలతో (Rain) నగరవాసులు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియక సతమతమవుతున్న పరిస్థితి. ఇదిలా ఉండగా... భాగ్యనగరంలో ఓ చోట కురిసిన వర్షాన్ని చూస్తే మాత్రం...‘‘వాహ్ క్యా రేన్ హే’’ అని అనకుండా ఉండరు మరి. మామూలుగా అయితే ఒక ప్రాంతంలో వర్షం కురిస్తే.. మరో ప్రాంతంలో పడకపోవడాన్ని చూస్తుంటాం. అలాగే పక్క రాష్ట్రాల్లో కుంభవృష్టిగా వర్షాలు పడుతుంటే... మన దగ్గర ఒక్క చుక్క కూడా వర్షపు నీరు పడని రోజుల చూశాం.

AP Politics: టాప్‌-5లో చంద్రబాబు


కానీ ఆరు అడుగుల పరిధిలోనే వర్షం పడటాన్ని ఎక్కడైనా చూశారా? ఇలాంటి అద్భుతమైన దృశ్యం హైదరాబాద్ వాసుల కంట పడింది. కేవలం ఆరు అడుగుల పరిధిలోనే వర్షం పడటాన్ని చూసి నగరవాసులు ఆశ్చర్య చకితులయ్యారు. ఇలా అద్భతరీతిలో వర్షం పడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

శ్రీవారి ఆలయం వద్ద గోల్డ్ మ్యాన్ల హల్చల్..


హైదరాబాద్‌లోని మురద్‌నగర్ పోస్టాఫీస్ సమీపంలో ఈ అందమైన దృశ్యం కనపబడింది. ఒక గల్లీలో ఒకవైపు మాత్రమే వర్షం పడుతుండగా.. మరో వైపు ఒక చుక్క వర్షపు నీరు కూడా పడకపోవడాన్ని వీడియోలో చూడొచ్చు. ఇలాంటి వింత వర్షాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తామెప్పుడూ ఇలాంటి వర్షాన్ని చూడలేదని వారు చెబుతున్నారు. ఇలా ఆరు అడుగులు మాత్రమే వర్షం పడుతున్న ద‌ృశ్యాన్ని కొందరు తమ తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియోకు పెద్ద సంఖ్యలో లైక్‌లు వచ్చి పడుతున్నాయి. ఇలాంటి వర్షాన్ని చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారంటే నమ్మండి.. ఇంతటి వింతైన వర్షాన్ని తాము ఎరుగమని కొందరు... వావ్ సూపర్ వర్షం అంటూ కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. సో... ఫ్రెండ్స్ మీరు కూడా ఈ సుందర దృశ్యాన్ని వీడియోలో చూసి ఆనందించండి.


ఇవి కూడా చదవండి...

Delhi: కవితతో ములాఖత్ కానున్న కేటీఆర్, హరీష్

Venkaiah: టంగుటూరు ప్రకాశం పంతులు జీవితం స్ఫూర్తిదాయకం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 23 , 2024 | 02:24 PM