Niranjan Reddy: కష్టకాలంలో పోచారం పార్టీ మారడం సరికాదు..
ABN , Publish Date - Jun 22 , 2024 | 04:02 AM
‘‘అధికారంలో ఉన్నపుడు పలు పదవుల్లో కొనసాగిన, సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి కష్టకాలంలో బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరడం సరికాదు.
ఆయన చెప్పిన కారణాలు వింటే సిగ్గేస్తోంది: బీఆర్‌ఎస్ నేతలు
హౖదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ‘‘అధికారంలో ఉన్నపుడు పలు పదవుల్లో కొనసాగిన, సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి కష్టకాలంలో బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరడం సరికాదు. ఇలాంటి వారిని చూసి తెలంగాణ సమాజం గందరగోళంలో పడుతోంది’’ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. స్పీకర్‌గా, వ్యవసాయ శాఖ మంత్రిగా, కేసీఆర్ ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చారని, ఆయన కుమారునికి డీసీసీబీ చైర్మన్ పదవి కూడా కల్పించారన్నారు. కాంగ్రె్‌సలో చేరిన సీనియర్ నేత పోచారం శ్రీనివా్‌సరెడ్డి చెప్పిన కారణాలు వింటే సిగ్గేస్తోందని బీఆర్‌ఎస్ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, జాజుల సురేందర్ అన్నారు. రేవంత్ వ్యవసాయానికి చేస్తున్న మేలును దృష్టిలో ఉంచుకొని కాంగ్రె్‌సలో చేరుతున్నానని పోచారం చెప్పడం ఆత్మవంచనేనని విమర్శించారు. ఇసుక దందాలు నడుస్తలేవనే ఆయన పార్టీ మారారని బీఆర్‌ఎస్ వారు ఆరోపించారు