Share News

New York Visit: న్యూయార్క్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌..

ABN , Publish Date - Aug 05 , 2024 | 03:17 AM

తెలంగాణ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నానికి న్యూయార్క్‌ నగరానికి చేరుకున్నారు.

New York Visit: న్యూయార్క్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌..

  • అమెరికా చేరిన రేవంత్‌ న్యూయార్క్‌లో సీఎంకు ఘన స్వాగతం

  • పెట్టుబడులే లక్ష్యంగా భేటీలు

  • రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేయడమే మనందరి కల: సీఎం

హైదరాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నానికి న్యూయార్క్‌ నగరానికి చేరుకున్నారు. న్యూయార్క్‌ ఎయిర్‌పోర్టులో రేవంత్‌ బృందానికి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్‌ బృందం పర్యటిస్తోంది.


10 రోజుల పాటు అమెరికా, దక్షిణకొరియాలో వివిధ నగరాల్లోని ప్రభుత్వ పెద్దలు, ప్రైవేటు వ్యాపార ప్రముఖులతో సమావేశాలు, చర్చల్లో బృందం పాల్గొననుంది. వారితో చర్చించి, రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టాలని ఆహ్వానించనున్నారు. సీఎం రేవంత్‌ వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సీఎస్‌ శాంతికుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. కాగా ‘‘కీలకమైన న్యూయార్క్‌ నగరం నుంచే పెట్టుబడుల సాధన పర్యటన ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నాను.


ప్రవాస భారతీయులైన ఇక్కడి మన తెలుగు సోదరసోదరీ మణులు గుండెల నిండా ప్రేమ, ఆప్యాయలతో మాకు స్వాగతం పలకడానికి వచ్చారు. మనందరినీ ఏకం చేసే కల.. తెలంగాణను మరింత గొప్పగా అభివృద్ధి చేసుకోవడం’’ అని సీఎం తన సందేశంలో పేర్కొన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్‌లో ట్వీట్‌ చేసింది.

Updated Date - Aug 05 , 2024 | 03:17 AM