Share News

TS News: సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫుడ్ పాయిజన్ ఘటనలో విషాదం

ABN , Publish Date - Apr 17 , 2024 | 07:42 AM

భువనగిరి సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రశాంత్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఈనెల 12 న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా పులిహోర తిన్న తర్వాత 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

TS News: సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫుడ్ పాయిజన్ ఘటనలో విషాదం

పసి వయసులోనే ఇంట్లో చదివించే స్థోమత లేకపోవడంతో చిన్నారులు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. భవిష్యత్ ఎలా ఉంటుంది? ఏంటనేది కూడా తెలియని చిన్నారులు కొందరి నిర్లక్ష్యం కారణంగా కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. చిన్నారులకు పెట్టే ఆహారంలో నాణ్యత కానీ.. పరిశుభ్రత కానీ ఉండటం లేదు. దీంతో ఫుడ్ పాయిజన్ అయిపోయి తమకు ఏం జరిగిందో కూడా తెలియక చిన్నారులు ఆసుపత్రి పాలవుతున్నారు. ఆపై పరలోకాలకూ పయనమవుతున్నారు.

Bhadradri: భద్రాచలం రామాలయంలో నేడు సీతారాముల కళ్యాణం


యాదాద్రి : భువనగిరి సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ (Hyderabad) నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రశాంత్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఈనెల 12 న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా పులిహోర తిన్న తర్వాత 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొందరు చిన్నారులను భువనగిరి ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్‌కు తరలించారు. మృతి చెందిన ప్రశాంత్‌ది పోచంపల్లి మండలం జిబ్ లక్ పల్లి గ్రామం. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

గల్ఫ్‌ కార్మికులకు ప్రత్యేక బోర్డు!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 17 , 2024 | 07:42 AM