Tirumala: తిరుమల వెంకన్నకు భూరి విరాళం.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Jan 19 , 2025 | 04:25 PM
ఆంధ్రప్రదేశ్: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు.. తన ఇష్టదైవం వెంకన్నకు రూ.6 కోట్ల భూరి విరాళం ఇచ్చారు.

తిరుమల: తిరుమల (Tirumala) శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. చెన్నై(Chennai)కి చెందిన వర్ధమాన్ జైన్ (Vardhaman Jain) అనే భక్తుడు.. తన ఇష్టదైవం వెంకన్నకు రూ.6 కోట్ల భూరి విరాళం ఇచ్చారు. ఇవాళ(ఆదివారం) ఉదయం కుటుంబసమేతంగా తిరుమలకు వచ్చిన వర్ధమాన్ జైన్.. రూ.6 కోట్లకు సంబంధించిన డీడీలను తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి(Venkaiah Chowdhury)కి అందజేశారు. ఇందులో రూ.5 కోట్లు ఎస్‌వీబీసీ కోసం ఇవ్వగా.. రూ.కోటి గోసంరక్షణ ట్రస్టుకు విరాళంగా అందజేశారు. కాగా, గతంలోనూ ఆయన పలుమార్లు స్వామివారికి విరాళం ప్రకటించారు.