Raghu Rama: రఘురామ కేసులో దూకుడు పెంచిన పోలీసులు
ABN , Publish Date - Jan 27 , 2025 | 08:35 PM
Raghurama Krishnam Raju: రఘురామ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రఘురామపై కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక నిందితులను పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో తులసి బాబును ఒంగోలుకు తరలించి అక్కడ పోలీసులు విచారణ జరపనున్నారు.

గుంటూరు జిల్లా : ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (AP Deputy CM Raghuramakrishnamraju) కస్టడీ టార్చర్ కేసులో (Custodial torture case) పోలీసులు దూకుడు పెంచారు. పోలీసు కస్టడీకి కామేపల్లి తులసి బాబును (Kamepalli Tulasi Babu)ఒంగోలుకు తరలించారు. ఇవాళ(సోమవారం) ఉదయం జీజీహెచ్‌కు తీసుకెళ్లి ప్రకాశం జిల్లా పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ హెచ్చు తగ్గులు ఉండటంతో ఆస్పత్రిలోనే తులసిబాబుకు వైద్యం అందించారు. దాదాపు ఐదు గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో తులసిబాబు ఉన్నారు. ఏకో, ఇతర పరీక్షలు నిర్వహించిన అనంతరం తులసిబాబును ఒంగోలుకు తరలించారు. మూడు రోజులపాటు ప్రకాశం జిల్లా పోలీసులు తులసి బాబును విచారించనున్నారు. ఒంగోలులో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో తులసిబాబు విచారణ కొనసాగనుంది.
కాగా.. రఘురామపై కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక నిందితులను పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో తులసి బాబు ప్రకాశం జిల్లా (Prakasam Dist.) ఎస్పీ దామోదర్ (SP Damodar) విచారించనున్నారు. రఘురామ కృష్ణంరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని తులసి బాబుపై ఆరోపణలు ఉన్నాయి. తులసి బాబుతో పాటు రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్‌ను పోలీసులు విచారించారు. ఈ కేసులో అరస్టైయి విజయ్ పాల్ ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్నారు. రఘురామను 2021 మే14న అప్పటి జగన్ ప్రభత్వం అరెస్టు చేసిన తర్వాత గుంటూరు సీఐడీ కార్యాలయంలో రాత్రాంతా ఉంచి.. కామేపల్లి తులసి బాబు.. హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న తన గుండెలపై కూర్చొని టార్చర్ చేశారంటూ రఘురామ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News