Pawan Kalyan: వైసీపీ అంటే గుర్తొచ్చేది ఇదే.. పవన్ కల్యాణ్ మాస్ సెటైర్స్..
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:42 PM
Pawan Kalyan: అసెంబ్లీలో వైసీపీ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో మూడుముక్కలాట ఆడిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయని పవన్ కల్యాణ్ అన్నారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల తీరు చూస్తే పాలసీ టెర్రరిజం గుర్తుకు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విమర్శించారు. వైసీపీ పాలనలో ఏపీ సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగానికి జనసేన పార్టీ తరపున, వ్యక్తిగతంగా తన తరపున ధన్యవాదాలు తెలిపారు. గతంతో ఇలాంటి సెషన్‌లు ఎప్పుడూ చూడలేదు... గొడవ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడటమేనని పవన్ కల్యాణ్ అన్నారు. గతంలో గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ ఉన్నప్పుడు తెలంగాణ అంశంలో ఇలాంటి గొడవ చూశానని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. అసలు అసెంబ్లీలో ఇలా ప్రవర్తించవచ్చా అని తనకు అనిపిస్తోందని అన్నారు. గవర్నర్ ప్రసంగం జరిగేటప్పుడు డిగ్నిటీని మెయింటెయిన్ చేయాలని రూల్ బుక్‌లో కూడా రాసి ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు.
ALSO READ: Botsa Satyanarayana : అందుకోసమే అసెంబ్లీకి రాలేదు.. బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్
వైసీపీ గొడవలకు పర్యాయపదం..
సభ్యులే ఈ రూల్‌ను బ్రేక్ చేస్తే ప్రజలకు ఏం చెబుతామని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అసెంబ్లీలో గొడవలు జరిగితే కేసులు ఎందుకు పెట్టరని మంత్రి మనోహర్‌ను అడిగానని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఇక్కడ సభ్యులపై కేసులు పెట్టడం లేదంటే అన్ని విషయాలు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారనే కదా అని పవన్ కల్యాణ్ చెప్పారు. నిన్న వైసీపీ సభ్యులు గవర్నర్‌పై చేసిన గొడవ మంచిది కాదని అన్నారు. సుప్రీంకోర్టు జస్టిస్‌గా ఆయన ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా, కళ్లల్లో చూడగలరా అని పవన్ కల్యాణ్ నిలదీశారు. నిన్న మీడియా ప్రతినిధులు తనను అడిగారు... వైసీపీ అనేది గొడవలకు పర్యాయపదమని విమర్శించారు. నిన్న అసెంబ్లీలో గొడవ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇన్నేళ్లు వైసీపీ నేతలను తట్టుకొని నిలబడటం చూస్తే ఆయనకు హ్యాట్సాప్ చెప్పాలని పవన్ కల్యాణ్ అన్నారు. నిన్న వారి గొడవ చూస్తే ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడికి వచ్చారో వివేకానంద రెడ్డి హత్య గుర్తుకువచ్చింది, ప్రజావేదిక, 200 ఆలయాల కూల్చివేతలు గుర్తుకువచ్చాయి, డాక్టర్ సుధాకర్ చనిపోవడం, జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలు గుర్తుకువచ్చాయని పవన్ కల్యాణ్ చెప్పారు. పత్రికాధిపతులపై దాడులు, టీడీపీ నేతలపై జరిగిన దాడులు, 53రోజులు చంద్రబాబును జైల్లో పెట్టిన విధానం గుర్తుకు వచ్చింది, అమరావతి రైతులును పెట్టిన హింస గుర్తుకువచ్చిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ సభ్యుల వ్యవహర శైలి మారలేదు..
గవర్నర్‌కు ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆయన ప్రసంగించ్చినందుకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటినుంచి వైసీపీ సభ్యులను ఇబ్బంది పెట్టవద్దని సీఎం చంద్రబాబు చెప్పారని.. అయినా వైసీపీ సభ్యుల వ్యవహర శైలి మారలేదని పవన్ కల్యాణ్ అన్నారు. నిన్న సభలో నుంచి వైసీపీ సభ్యులు బయటకు వెళ్లిపోవడంలో తమ తప్పులేకపోయినా గవర్నర్‌కు ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పామని అన్నారు. గత జగన్ ప్రభుత్వం మూడు ముక్కలు ఆడటంతో పెట్టుబడులు రాక ఏపీ ఆర్థిక పరిస్థితి క్షీణించిందని వాపోయారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఈ సవాళ్లను ఎదుర్కొని ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నారని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. గత కొంత కాలంగా రాష్ట్రం ఆర్థిక సుస్ధిరత కోల్పోయినా సీఎం చంద్రబాబు దారిలో పెడుతున్నారని చెప్పారు. పంచాయితీరాజ్‌లో అవినీతికి తావు లేకుండా ఉద్యోగుల బదిలీలు చేశామని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.
విజన్ 2047కు అనుగుణంగా పనిచేస్తున్నాం..
గ్రామ సభలు రికార్డు స్థాయిలో పల్లె పండుగ రూపంలో నిర్వహించామని పవన్ కల్యాణ్ తెలిపారు. రూ. 4500 కోట్ల వ్యయంతో 30వేల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని అన్నారు. ఆరునెలల్లో 4300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. 22500 గోకులాలను నిర్మించామని తెలిపారు. 268 మినిగోకులాలను మాత్రమే వైసీపీ ఐదేళ్లలో ఏర్పాటు చేసిందన్నారు. విజన్ 2047కు అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు జలజీవన్ మిషన్‌ను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. వీసీల నియామకాన్ని మెరిటోరియస్ ఓరియంటెడ్‌గా మంత్రి నారా లోకేష్ నియమించారని.. దానికి ఆయనను అభినందిస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అటవీ అభివద్ధికి చర్యలు..
‘‘ఏపీలో అటవీ కవర్‌ను 50శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని దేవాలయాలు అటవీ ప్రాంతంలో ఉన్నాయి. అక్కడికి అడవిలో కొత్తదారి గుండా భక్తులు వెళ్లారు. అందుకే ఏనుగులు దాడి చేశాయి.. గున్న ఏనుగులను పంపాలని చూడటంతో దాడి చేశాయి. కుంకి ఏనుగుల కోసం కర్నాటకకు వెళ్తే అక్కడి వారు రూ.125 కోట్లు తమకు లాభం వచ్చిందని అన్నారు. ఇక్కడి ఎర్రచందనం అక్కడ పట్టుకొని ఆ ఆదాయం పొందారు... ఈ విషయం గత అటవీ మంత్రి ఎలా చూస్తారు ఆయనే అటవీ భూమిని ఆక్రమించారు. గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గిరిజన ప్రాంతాల్లో రహదారులు వేశాం... దీంతో ఆయా ప్రాంతాల్లో ఆంబులెన్స్ కూతలు వినపడ్డాయి. వైసీపీ పాలనలో ఏపీ నలిగిపోతున్న కాలంలో వారి ప్రభుత్వం ఇంకోసారి వస్తే రాష్ట్రం ఏమవుతుంది. గత ప్రభుత్వంలో ఎంత మంది ఇబ్బంది పడ్డారు అంటే 90శాతం మంది చేతులెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్దకు వెళ్లాం. డిస్ ఇన్వెస్టమెంట్‌కు వైసీపీ మద్దతు పలికింది. మేము ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కోరాం. విశాఖ ఉక్కును కాపాడలేమని చెప్పినా ముఖ్యమంత్రి చాలా బలంగా తీసుకువెళ్లారు. గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను ముక్కులు చేసి అమ్ముకోవాలని చూసింది. ఇలాంటి స్టీల్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి నేతృత్వంలో కాపాడాం. వైసీపీని ఐక్యకార్యచరణ ప్రకటించమంటే ప్రకటించలేదు... ఇప్పడు మేము నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విశాఖ ఉక్కును కాపాడుకోగలిగాం’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
సంకీర్ణంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
సంకీర్ణంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కూటమి అధికారంలోకి రాగానే పోలవరంను కాపాడగలిగాం, రూ.12వేలకు పైగా నిధులు కేటాయించేలా ప్రయత్నాలు చేశాం. అమరావతి నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళ్తుంది. కేంద్రం ఇచ్చిన మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు. గత ఐదేళ్లు ముఖ్యమంత్రి సహ ఆందరం ఇబ్బందిపడ్డాం. సంకీర్ణ ప్రభుత్వం చాలా చాలెంజ్. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కలిసి ఉంటామంటే మేము ప్రజల కోసం కలిసి ఉంటాం. సంకీర్ణ ప్రభుత్వం కలిసి ఉండేలా 15 సంవత్సారాల పాటు కలిసి ఉంటామని హమీ ఇస్తున్నాం. కూటమి విషయాలు మా కుటుంబ విషయం. ఇంకొక్కసారి మాత్రం గవర్నర్‌కు గౌవరం ఇవ్వని పార్టీని అధికారంలోకి రానివ్వం. ధామాషా ఓటింగ్ ప్రకారం ప్రతిపక్షం కావాలంటే వారు జర్మనీ వెళ్లాలి అక్కడే అవకాశం ఉంది. ప్రతిపక్షం ఉండాల్సిన సమయంలో అధికార పక్షం... ప్రతిపక్షం మేమే. తిరుపతిలో తొక్కిసలాట విషయంలో క్షమాపణలు చెప్పామంటే మనం తప్పుచేయకూడదనే.. ఆరోజు మనం సారీ చెప్పకపోతే వారి బలాన్ని పెంచిన వారము అవుతాము. మనకు విభేదాలు ఉంటాయి... తల్లికి పుట్టిన బిడ్డలకే విభేదాలు ఉంటాయి. కంఠంలో ప్రాణం ఉన్న వరకూ రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తాం. దేశం కోసం ప్రాణాన్ని అయినా ఇస్తాం’’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
AP Council: వైసీపీ ఎమ్మెల్సీలకు చుక్కలు చూపించిన లోకేష్.. మార్క్ మై వర్డ్స్.. మీ అందరూ లోపలికే
purandeswari: అసెంబ్లీకి జగన్ హాజరుపై ఎంపీ పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యలు
Vamsi into custody: మూడు రోజుల కస్టడీకి వంశీ.. ప్రశ్నలు సిద్ధం చేసుకున్న పోలీసులు
Read Latest AP News And Telugu News