Raghurama Raju: కస్టోడియల్ టార్చర్ కేసులో షాకింగ్ విషయాలు బయటపెట్టిన రఘురామ
ABN , Publish Date - Jan 26 , 2025 | 02:58 PM
Raghurama Raju: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిని గుర్తించడం కోసం జిల్లా న్యాయమూర్తి సమక్షంలో ఇవాళ(ఆదివారం) పోలీసులు పరేడ్ (Parade) నిర్వహించారు. ఈ పరేడ్‌లో షాకింగ్ విషయాలను రఘురామ బయటపెట్టారు

గుంటూరు జిల్లా: కస్టోడియల్ టార్చర్ కేసులో (Custodial torture case) గుంటూరు జిల్లా జైల్లో నిందితుడిని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ (AP Deputy Speaker) రఘురామకృష్ణంరాజు (Raghuramakrishnam Raju) గుర్తించడానికి గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు. అయితే నిందితుడిని గుర్తించడం కోసం జిల్లా న్యాయమూర్తి సమక్షంలో ఇవాళ(ఆదివారం) పోలీసులు పరేడ్ (Parade) నిర్వహించారు. కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని రిమాండ్‌లో ఉన్న తులసిబాబు కోర్టును ఆశ్రయించారు. దీంతో తులసిబాబు పోలికలతో ఉన్న వ్యక్తులతో రఘురామకు పరేడ్ నిర్వహించారు. కాగా ఈ కేసులో ఇప్పటికే మాజీ సీఐడీ ఏఎస్సీ విజయ్‌పాల్ అరెస్టై గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. పరేడ్ ముగిసిన అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడారు.
నా స్టేట్‌మెంట్ రికార్డు చేశారు..
‘‘నా స్టేట్‌మెంట్‌ను జిల్లా న్యాయమూర్తి రికార్డు చేశారు. నా గుండెలపై కూర్చొని నన్ను కొట్టిన వ్యక్తిని నేను గుర్తించాను. మొత్తం ఏడుగురుని చూపించారు. నా గుండెలపై కూర్చొనప్పుడు పెట్టుకున్న మాస్క్ జారీ పోయింది. నాపై కూర్చొని ఫోన్ ఓపెన్ చేయాలని కూడా అడిగాడు. నాపై దాడికి మొత్తం ఐదు మంది వచ్చినట్లు గుర్తించాను. గుడివాడలో టీడీపీని తులసీ బాబే బతికించాడని ప్రచారం చేసుకుంటున్నారు. నేనైతే టీడీపీ అధిష్టానానికి తులసీ బాబుపై ఫిర్యాదు చేయలేదు. తులసీ బాబుకు టీడీపీ సభ్యత్వం లేదని తెలిసింది. ఇక నుంచి తులసీ బాబును పక్కన పెడతారని అనుకుంటున్నాను. నాపై దాడి కేసులో A1, A2, A3లు ఎందుకు స్పందించడం లేదో అర్ధం కావడం లేదు. నిబంధనల ప్రకారం కేసు నమోదు కాగానే ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి. డాక్టర్ ప్రభావతి పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. నా కేసులో అప్పటి కలెక్టర్ వివేక్ యాదవ్‌ను కుడా విచారించాలి. నన్ను అదుపులోకి తీసుకోక ముందే డాక్టర్ టీం రెడీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వివేక్ యాదవ్ పాత్ర ఏంటో కూడా తేల్చాలి’’ అని రఘురామకృష్ణంరాజు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!
Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..
Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల
Read Latest AP News and Telugu News