TDP: వైసీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు: పల్లా
ABN , Publish Date - Jan 20 , 2025 | 12:34 PM
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11,400 కోట్లు ప్యాకేజ్ ఇచ్చి ఆదుకున్న ప్రధాని మోదీ, ఉక్కు కర్మాగారాన్ని ఆదుకోవడానికి కృషి చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కూటమినేతలందరికీ ధన్యవాదాలు చెప్పారు.

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు (TDP State President) పల్లా శ్రీనివాస్ (Palla Srinivas) గత జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు (Comments) గుప్పించారు. అనేక కారణాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) నష్టాల్లోకి వెళ్ళిందని, వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఆయన మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చేనాటికి 25 శాతం ఉత్పత్తి సామర్థ్యం ఉందని, ఇప్పుడు రూ.1650 కోట్లతో 75 శాతానికి ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ఆదుకున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్లాంట్ అభివృద్ధికి కృషి చేసిన కూటమి నేతలకు ధన్యవాదాలు చెప్పారు. ప్లాంట్ అభివృద్ధికి కార్మికులు, యాజమాన్యం సమష్టి కృషి చేయాలని పల్లా శ్రీనివాస్ పిలుపిచ్చారు.
ఈ వార్త కూడా చదవండి..
పోలీసులపై మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
సక్రమంగా నడిచేలా బాధ్యత..
ఈ సందర్భంగా సోమవారం పల్లా శ్రీనివాస్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11,400 కోట్లు, ప్యాకేజ్ ఇచ్చి ఆదుకున్న ప్రధాని మోదీ, ఉక్కు కర్మాగారాన్ని ఆదుకోవడానికి కృషి చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కూటమినేతలందరికీ ధన్యవాదాలు చెప్పారు. గతంలో కూడా టీడీపీ, వాజ్‌పేయి సహకారంతో స్టీల్ ప్లాంట్‌ను ఆదుకుందన్నారు. 2 సంవత్సరాల్లో ఫుల్ కెపాసిటీతో రన్ చేయగలిగితే సెయిల్‌లో మెర్జ్ చేయొచ్చునని అన్నారు. నాయకులుగా తమ బాధ్యతను సక్రమంగా చేసామని, కార్మికులుగా, ఉద్యోగులుగా మీ బాధ్యతలు మీరు సక్రమంగా చేయాలన్నారు. సక్రమంగా నడిచేలా బాధ్యతగా ఉండాలన్నారు.
బాబు ఉంటేనే ఫ్లాంట్ ఉంటుంది..
చంద్రబాబు ఉంటేనే స్టీల్ ప్లాంట్ ఉంటుందని.. ఇది గతంలో.. ఇప్పుడు కూడా రుజువు అయిందని పల్లా శ్రీనివాస్ అన్నారు. కార్మికుల యాజమాన్యం సమిష్టిగా కృషి చేయాలని, ఎన్నికల ముందు, చంద్రబాబుకు స్టీల్ ప్లాంట్‌పై స్పష్టమైన హామీ అడిగామని, స్థానిక నేతలుగా మీరు ఏ హామీ ఇస్తే, అదే మన పార్టీ హామీ అని చంద్రబాబు స్వయంగా చెప్పారన్నారు. కొంతమంది ఉద్యమంగా తీసుకుంటున్నారని.. ఉద్యమ జీవితంగా చేయకూడదన్నారు. స్టీల్ ప్లాంట్ తీసి అక్కడ క్యాపిటల్ నిర్మాణం జరిగితే ఎలా ఉంటుందని స్వయంగా, జగన్ చెప్పారని, అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారన్నారు. 7000 కోట్ల రూపాయలకు భూములు అమ్మేద్దామని జగన్ చూశారని అన్నారు.
నిర్వాసితుల మనోభావాలతో ఆడుకోవద్దు..
ఇంకా 8 వేలమంది నిర్వాసితులు ఉన్నారని.. నిర్వాసితుల మనోభావాలతో ఆడుకోవద్దని పల్లా శ్రీనివాస్ అన్నారు. కొంతమంది ఉద్యమం చేస్తామంటున్నారు.. వారందరూ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు కార్మికులకు తరుపున కృషి చేయాలన్నారు. ఉద్యమం మీద బ్రతకాలని ప్రయత్నం చేయొద్దని, మైన్స్ కావాలంటున్నారు.. తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామన్నారు. ప్లాంట్‌కు అన్ని విధాలుగా సహకరిస్తామని.. అన్ని తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం , మాంగనీస్, సాండ్ మైన్, క్వా డ్జ్ మైన్స్ ఎందుకు, వైసీపీ రెవెన్యూవల్ చేయలేదని ప్రశ్నించారు. జగన్ ప్లాంట్ గురించి మాట్లాడొద్దన్నారని వైసీపీ నేతలు చాలామంది చెప్పారన్నారు. స్టీల్ ప్లాంట్‌లో ఉన్న లోపాలను, ఇబ్బందులను రాష్ట్ర గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకుందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రివ్యూ చేయాలని మేము కోరామని పల్లా శ్రీనివాస్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారంలో ఉద్రిక్తత
క్రమశిక్షణా కమిటీ ముందు ఎమ్మెల్యే కొలికపూడి
హైదరాబాద్ సిటీ పోలీస్ వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News