Araku Coffee: మన్యం కాఫీకి మరో అరుదైన ఖ్యాతి
ABN, Publish Date - Mar 19 , 2025 | 07:10 AM
అరకు కాఫీగా ప్రపంచ గుర్తింపు పొందిన మన్యం కాఫీకి మరో అరుదైన ఖ్యాతి లభించింది. ఏపీ అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సమక్షంలో దీనిని మంగళవారం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లాంఛనంగా ప్రారంభించారు.

అరకు కాఫీగా ప్రపంచ గుర్తింపు పొందిన మన్యం కాఫీకి మరో అరుదైన ఖ్యాతి లభించింది.

ఏపీ అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సమక్షంలో దీనిని మంగళవారం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లాంఛనంగా ప్రారంభించారు.

కాగా గతేడాది జూలైలో ఢిల్లీలో నిర్వహించిన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ‘అరకు కాఫీ’ ప్రత్యేకతను ప్రత్యేకంగా ప్రస్తావించడంతో అప్పట్లో మరో మారు అరకు కాఫీ దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది.

గిరిజనులు సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేయడమే ఈ కాఫీకి ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణం.

ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో సేంద్రీయ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది.

ఏజెన్సీలోని గిరిజనులకు చెందిన కాఫీ ఉత్పత్తికి దేశీయ, విదేశీ మార్కెట్‌లో ఆశించిన గిరాకీ ఏర్పడింది.

దేశంలో కర్ణాటక రాష్ట్రం తర్వాత స్థానం కాఫీ సాగులో ఆంధ్రప్రదేశ్‌దే కావడం విశేషం.

అలాగే గిరిజన రైతులు రసాయన, ఆధునిక పద్ధతులకు దూరంగా వాటిని పండిస్తుండడంతో మార్కెట్‌లో మన్యం కాఫీ గింజలకు ప్రత్యేక స్థానం ఏర్పడింది.

గిరిజనులు పోడు వ్యవసాయంపై ఆధారపడి అడవులను నాశనం చేయకుండా ఉండేందుకు గానూ 1989లో కాఫీ సాగును ప్రభుత్వం గిరిజనులకు పరిచయం చేసింది. దీంతో 1989 నుంచి 2002 వరకు కేవలం 32,072 ఎకరాల్లో మాత్రమే కాఫీ తోటలు అభివృద్ధి జరగ్గా, 2003 నుంచి 2008 వరకు 64,265 ఎకరాల్లో కాఫీ తోటలు వేశారు.
Updated at - Mar 19 , 2025 | 07:12 AM