BCCI: ఐపీఎల్‌కు రోహిత్-కోహ్లీ దూరం.. స్టార్లపై బీసీసీఐ ఉక్కుపాదం
ABN , Publish Date - Jan 17 , 2025 | 01:30 PM
IPL 2025: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎదురులేని సూపర్‌స్టార్లుగా కొనసాగుతున్నారు. అటు టీమిండియాలో, ఇటు ఐపీఎల్‌లో వీళ్ల హవా మామూలుగా లేదు.

రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ.. ఈ మోడర్న్ గ్రేట్స్ లేకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ఊహించగలమా? అంటే కష్టమనే చెప్పాలి. అసలు ఆ ఆలోచన కూడా చేయలేరు అభిమానులు. కానీ పరిస్థితులు చూస్తుంటే ఇది జరిగే ప్రమాదం కనిపిస్తోంది. రోహిత్-కోహ్లీ ఆడకపోతే లీగ్ వ్యాల్యూ పడిపోవచ్చనే సందేహం మీకు రావొచ్చు. కానీ భారత క్రికెట్ బోర్డు ఆలోచన వేరేలా ఉంది. ఐపీఎల్ కంటే టీమిండియానే తమకు ముఖ్యం అని భావిస్తోంది. అందుకే భారత జట్టులోని ప్రతి ఆటగాడు తప్పనిసరిగా పాటించాలంటూ 10 నిబంధనలతో కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. రోహిత్, కోహ్లీ అయినా సరే వీటిని ఫాలో అవ్వకపోతే ఐపీఎల్‌లో ఆడకుండా బ్యాన్ విధిస్తామని హెచ్చరించింది.
హద్దు మీరితే నిషేధమే!
రోహిత్, కోహ్లీకి ఇన్నాళ్లూ టీమిండియాలో ఎదురులేకుండా పోయింది. ఒకరు ప్రస్తుత సారథి, మరొకరు మాజీ కెప్టెన్ అవడంతో వాళ్ల మాటే శాసనంగా ఉండేది. వీళ్లతో పాటు ఇతర స్టార్లు కూడా హవా చలాయించేవారు. ఒకవైపు టీమ్ కోసం తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూనే.. మరోవైపు రూల్స్‌కు లోబడి ఎంజాయ్ చేసేవారు. అయితే క్రమంగా నిబంధనలు సడలిపోవడంతో విదేశీ సిరీస్‌ల్లో ఫ్యామిలీతో కలసిరావడం, ఫొటో సెషన్స్, ప్రాక్టీస్‌కు ప్రైవేటు వెహికిల్స్ రావడం ఇలా చాలా జరిగాయని తెలుస్తోంది. దీంతో సీరియస్ అయిన బోర్డు పెద్దలు రోకో జోడీ కాళ్లకు బంధం వేయాలని డిసైడ్ అయ్యారట. అందులో భాగంగానే కొత్త రూల్స్ తీసుకొచ్చారని తెలుస్తోంది.
కొత్త రూల్స్‌తో గుబులు!
బీసీసీఐ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం ఏ టీమిండియా ప్లేయర్ కూడా టూర్ల సమయంలో పర్సనల్ షూట్లకు వెళ్లకూడదు. ప్రాక్టీస్ సెషన్స్ టైమ్‌లో ఆటగాళ్లంతా ఒకేచోట ఉండాలి. నెట్ సెషన్స్‌కు కలసి వెళ్లాలి, అలాగే కలసి తిరిగిరావాలి. వ్యక్తిగత సిబ్బందిని వెంట తెచ్చుకోవడాన్ని నిషేధించింది బోర్డు. ఫ్యామిలీని టూర్లకు తీసుకెళ్లడం మీద అలాగే లగేజీపై పరిమితులు విధించింది. ఏ ఆటగాడైనా సరే దేశవాళీల్లో ఆడాల్సిందేనంటూ కఠిన నిబంధనలు విధించింది. ఈ రూల్స్‌ను అతిక్రమిస్తే ఐపీఎల్‌లో ఆడకుండా బ్యాన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. సీనియర్లు కోహ్లీ, రోహిత్, రాహుల్, హార్దిక్ లాంటి వారిని టార్గెట్ చేసుకొని నిబంధనలు మరింత కఠినతరం చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవీ చదవండి:
ఖేల్‌రత్న అందుకున్న మను, గుకేశ్
10 పాయింట్లతో బీసీసీఐ ప్రక్షాళన షురూ
బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి