Share News

BCCI: టీమిండియాకు బీసీసీఐ షాక్.. 10 పాయింట్లతో ప్రక్షాళన షురూ

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:09 AM

BCCI Guidlines: భారత క్రికెట్ బోర్డు ప్రక్షాళన షురూ చేసింది. టీమిండియా సీనియర్లతో కోచింగ్ స్టాఫ్‌కు పడకపోవడం, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గందరగోళంగా ఉండటంపై కన్నెర్ర చేసింది. ఇక నుంచి వీటికి చాన్స్ లేకుండా 10 గైడ్‌లైన్స్‌లు విడుదల చేసింది. వీటిని పాటించని ప్లేయర్లపై కొరడా ఝళిపించనుంది.

BCCI: టీమిండియాకు బీసీసీఐ షాక్.. 10 పాయింట్లతో ప్రక్షాళన షురూ
Team India

భారత క్రికెట్ బోర్డు ప్రక్షాళన షురూ చేసింది. టీమిండియా సీనియర్లతో కోచింగ్ స్టాఫ్‌కు పడకపోవడం, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గందరగోళంగా ఉండటంపై కన్నెర్ర చేసింది. కొందరు ఆటగాళ్లు మ్యాచ్ ప్రాక్టీస్ ఎగ్గొట్టడం, నెట్ సెషన్స్‌కు టీమ్‌తో కాకుండా ప్రైవేట్ వెహికిల్స్‌లో రావడం బోర్డు దృష్టికి వెళ్లాయి. అదే సమయంలో అడ్డగోలుగా లగేజీలు తీసుకెళ్లడం, ఫ్యామిలీతో కలసి టూర్లలో ఎంజాయ్ చేస్తూ గేమ్‌ మీద ఫోకస్ చేయడం లేదనే కంప్లయింట్స్ కూడా వెళ్లాయి. దీంతో సీరియస్ అయిన బీసీసీఐ.. ఇక మీదట వీటికి చాన్స్ లేకుండా ప్రక్షాళన మొదలుపెట్టింది. ఆటగాళ్లందరికీ షాక్ ఇస్తూ.. 10 పాయింట్లతో కూడిన స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది. వీటిని పాటించని ప్లేయర్లపై కొరడా ఝళిపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. మరి.. ఆ పది పాయింట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..


గౌతీ సూచనలతో..

ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ దారుణంగా విఫలమవడంతో హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు బీసీసీఐ పెద్దలు. ఇందులో గంభీర్ పలు సూచనలు చేయగా.. మిగతా అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని 10 పాయింట్లతో కొత్త పాలసీని అనౌన్స్ చేసింది బోర్డు. అందులోని ప్రధాన నిర్ణయాలు ఇవే..

డొమెస్టిక్ టోర్నమెంట్స్

నేషనల్ టీమ్‌కు ఎంపికవ్వాలంటే ఇక మీదట ప్రతి ఆటగాడు డొమెస్టిక్ టోర్నీల్లో కచ్చితంగా ఆడాలి. మ్యాచ్ ఫిట్‌నెస్, స్ట్రెంగ్త్‌నింగ్, ఫామ్‌ను మెరుగుపర్చుకోవడానికి దేశవాళీలు చాలా ముఖ్యమని బోర్డు స్పష్టం చేసింది.

టీమ్‌తోనే జర్నీ

ఆటగాళ్లు ఇక మీదట వ్యక్తిగతంగా కాకుండా జట్టుతోనే ప్రయాణించాలి. ఒకవేళ కుటుంబంతో జర్నీ చేయాలంటే ముందస్తుగా కోచ్ లేదా సెలెక్షన్ కమిటీ పర్మిషన్ తీసుకోవాలి.


లగేజీ

ఆటగాళ్లు ఇకపై లగేజ్ బ్యాగ్ పరిమితులు పాటించాలి. అదనపు లగేజీ తీసుకెళ్లాలంటే తమ సొంత ఖర్చుతోనే భరించాల్సి ఉంటుంది.

పర్సనల్ స్టాఫ్

బీసీసీఐ అనుమతి లేకుండా ఇక మీదట మేనేజర్లు, చెఫ్స్, సెక్యూరిటీ లాంటి పర్సనల్ స్టాఫ్‌ను వెంట తీసుకెళ్లడం కుదరదు.

ప్రాక్టీస్

ముందుగా నిర్దేశించిన ప్రాక్టీస్ షెడ్యూల్ ముగిసేవరకు ఆటగాళ్లందరూ గ్రౌండ్‌లోనే ఉండాలి. నెట్ సెషన్ పూర్తైన తర్వాత ఒకేసారి అందరూ కలసి ప్రయాణించాలి.

ఎండార్స్‌మెంట్స్

టూర్స్ సమయంలో ఎలాంటి పర్సనల్ షూట్స్ లేదా ఎండార్స్‌మెంట్స్‌కు పర్మిషన్ లేదు. గేమ్ మీద ఫోకస్ దెబ్బతినకుండా ఉండేందుకు బోర్డు ఈ మేరకు కఠిన నిబంధన తీసుకొచ్చింది.


ఫ్యామిలీ

విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్ల వెంట వారి కుటుంబ సభ్యులను ఇంతకుముందులా తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. 45 రోజుల కంటే ఎక్కువ గల ఫారెన్ టూర్లలో మాత్రమే ప్లేయర్ల ఫ్యామిలీస్‌కు అనుమతి ఇస్తారు. అది కూడా 2 వారాలకే పరిమితం.

బోర్డు కార్యక్రమాలు

బీసీసీఐ అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలకు ఆటగాళ్లు అందుబాటులో ఉండాలి. డుమ్మా కొడితే కఠిన చర్యలు తప్పవు.

ఆటగాళ్ల సంబంధాలు

కొత్త పాలసీ ప్రకారం ప్లేయర్లు అందరూ క్రమశిక్షణతో ఉంటూ జట్టు విజయం కోసం కష్టపడాలి. ఆటగాళ్లంతా పరస్పరం ఐక్యతతో ఉండాలి. ఇది ఆటలో మెరుగుదలకు దోహదపడుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. అలాగే సిరీస్ లేదా మ్యాచ్‌లు ముందుగానే ముగిసినా అంతా కలిసే ప్రయాణం చేయాలని పేర్కొంది.


ఇవీ చదవండి:

బ్యాటింగ్‌ కోచ్‌గా సితాన్షు కోటక్‌

ఇంగ్లండ్‌ టూర్‌లో మూడు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు

‘హజారే’ టైటిల్‌పోరుకు విదర్భ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 17 , 2025 | 11:10 AM