Share News

Rohit-Kohli: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. రోహిత్-కోహ్లీని ఆడిస్తారా.. ఆపేస్తారా..

ABN , Publish Date - Jan 07 , 2025 | 10:37 AM

టీమిండియాకు మూలస్తంభం లాంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. దశాబ్ద కాలం నుంచి టీమ్ మొత్తం వీళ్ల భుజస్కంధాల మీదే నడుస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఇద్దరికీ జట్టులో చోటే కష్టంగా మారింది. త్వరలో జరిగే ఇంగ్లండ్ సిరీస్‌తో వీరి భవితవ్యంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Rohit-Kohli: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. రోహిత్-కోహ్లీని ఆడిస్తారా.. ఆపేస్తారా..
Rohit-Kohli

IND vs ENG: టీమిండియాకు మూలస్తంభం లాంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. దశాబ్ద కాలం నుంచి టీమ్ మొత్తం వీళ్ల భుజస్కంధాల మీదే నడుస్తోంది. ఇద్దరూ టన్నుల కొద్దీ పరుగులు బాది ఎన్నో కఠిన మ్యాచుల్లో జట్టును గెలిపించారు. కెప్టెన్స్‌గానూ టీమ్‌ మీద తమదైన ముద్ర వేశారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నట్లు.. టాప్ ప్లేయర్లుగా ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు జట్టులో చోటు కోసం కష్టపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఇద్దరికీ టీమ్‌లో బెర్త్ కష్టంగా మారింది. ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టుల్లో వీళ్ల కెరీర్ దాదాపుగా ముగిసిందనే స్పష్టత వచ్చేసింది. త్వరలో జరిగే ఇంగ్లండ్ సిరీస్‌తో వీరి వన్డే క్రికెట్ భవితవ్యం పైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి.. ఆ సిరీస్‌లో వీళ్లను ఆడిస్తారా? ఆపేస్తారా? అనేది ఇప్పుడు చూద్దాం..


లీకులు వైరల్!

బీజీటీతో నెల రోజుల పాటు విశ్రాంతి లేని క్రికెట్ ఆడిన భారత ఆటగాళ్లు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో రెండు వారాల పాటు రెస్ట్‌ మోడ్‌లో ఉంటారు. ఆ తర్వాత జనవరి 22 నుంచి మొదలయ్యే ఇంగ్లండ్ సిరీస్‌లో పార్టిసిపేట్ చేస్తారు. ముందుగా టీ20 సిరీస్, ఆ తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి వన్డే సిరీస్ స్టార్ట్ కానుంది. అయితే ఈ సిరీస్‌లో రోహిత్-కోహ్లీ బరిలోకి దిగుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో జట్టు దారుణ ఓటములతో రోకో జోడీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. బ్యాటింగ్ ఫెయిల్యూర్‌తో వీళ్లను టీమ్‌లో నుంచి తీసేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆల్రెడీ సిడ్నీ టెస్ట్‌లో రోహిత్‌ను ఆడించలేదు. దీంతో వీళ్ల వన్డే కెరీర్ కూడా డేంజర్‌లో పడిందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందుకు తగ్గట్లే వన్డే టీమ్ గురించి బీసీసీఐ కొన్ని లీకులు కూడా వదిలింది.


ఆడించాల్సిందే!

చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా ముందుకు నడిపిస్తాడు, ఇంగ్లండ్‌తో సిరీస్‌లో హార్దిక్ పాండ్యా తాత్కాలిక సారథిగా ఉంటాడంటూ భారత బోర్డు నుంచి కొన్ని లీకులు బయటకు వచ్చాయి. ఇవి నిజమా? కాదా? తెలియదు. కానీ క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఇంగ్లండ్ సిరీస్‌లో రోహిత్-కోహ్లీని ఆడించరట. కానీ ఇందులో నిజం లేదనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఇద్దరు స్టార్ల టెస్టు ఫెయిల్యూర్‌కు వన్డేలకు ముడిపెట్టలేం. అందునా వన్డేల్లో వీళ్లిద్దరూ ఎంత తోపు ఆటగాళ్లో అందరికీ తెలుసు. చాంపియన్స్ ట్రోఫీకి ఎక్కువ టైమ్ కూడా లేదు. కాబట్టి ఈ సమయంలో రోహిత్-కోహ్లీని తీసేస్తే బీసీసీఐ మీద, టీమిండియాపై వ్యతిరేకత పెరుగుతుంది. ఇంగ్లండ్ సిరీస్ పెర్ఫార్మెన్స్‌ను బట్టి చాంపియన్స్ ట్రోఫీలో రోకో జోడీని టీమ్‌లోకి తీసుకోవాలా? వద్దా? అనే క్లారిటీ వస్తుంది. అందుకే ఈ సిరీస్‌లో వీరిని ఆడిస్తారని అనలిస్టులు అంటున్నారు. ఇంగ్లండ్‌పై ఫెయిలైతే రోహిత్-కోహ్లీకి వేరే ఆప్షన్ ఉండదని.. రిటైర్మెంట్ ప్రకటించక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


ఇవీ చదవండి:

రోహిత్‌కు అంబానీ వార్నింగ్.. ఓవరాక్షన్ చేస్తే ఊరుకోనంటూ..

‘రిజర్వ్‌’ పేస్‌లో పదునేది?

‘సెలెక్టర్లే నిర్ణయం తీసుకొంటారు’

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 07 , 2025 | 10:42 AM