Rishabh Pant: కెప్టెన్‌గా రిషబ్ పంత్.. ఈసారి కప్పు కొట్టేలా ఉన్నారే
ABN , Publish Date - Jan 20 , 2025 | 03:59 PM
Rishabh Pant As Captain: డాషింగ్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అనుకున్నది సాధించాడు. సారథ్యం కోసం అతడు చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. కెప్టెన్సీ దక్కించుకున్న పంత్.. కప్పుపై కర్చీఫ్ వేసేందుకు సిద్ధమవుతున్నాడు.

టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అనుకున్నది సాధించాడు. కెప్టెన్సీపై కన్నేసిన పించ్ హిట్టర్... దాన్ని దక్కించుకున్నాడు. బరిలోకి సారథిగానే దిగాలని అనుకున్న పంత్.. అదే చేసి చూపించాడు. ఆ జట్టు తనకు ఉద్వాసన పలకడంతో.. పట్టుదలతో ఉన్న పంత్ ఎట్టకేలకు కెప్టెన్సీ దక్కించుకొని సంతోషంలో మునిగిపోయాడు. మరి.. పంత్‌కు కెప్టెన్సీ ఎలా దక్కింది? ఏ టీమ్‌కు అతడు సారథిగా నియమితుడయ్యాడు? అతడి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రాహుల్ అటు.. పంత్ ఇటు..!
ఐపీఎల్‌లో లక్నో సూపర్ జియాంట్స్ నూతన సారథిగా పంత్ నియామకం అయ్యాడు. ఐపీఎల్-2025లో లక్నోను కెప్టెన్‌గా ముందుండి నడిపించనున్నాడీ పించ్ హిట్టర్. ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్లేస్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు పంత్. గతేడాది ఆఖర్లో జరిగిన మెగా ఆక్షన్‌కు ముందు అటు ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్‌ను వదులుకుంది. ఇటు లక్నో టీమ్ నుంచి రాహుల్ బయటకు వచ్చాడు. వేలంలో రాహుల్ ఢిల్లీకి వెళ్లగా.. పంత్‌ను రూ.27 కోట్ల ఊహించని ధర చెల్లించి ఎల్‌ఎస్‌జీ సొంతం చేసుకుంది.
అతడే బెస్ట్ కెప్టెన్!
మెగా వేలం ముగిసి చాన్నాళ్లు కావొస్తున్నా కొత్త కెప్టెన్ ఎవరనేది లక్నో ప్రకటించలేదు. అదే సమయంలో ఆ పోస్ట్ కోసం జట్టులోని సీనియర్ బ్యాటర్ నికోలస్ పూరన్ పేరు బాగా వినిపించింది. దీంతో అసలు ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ పంత్ తమ కొత్త కెప్టెన్ అని తాజాగా ప్రకటించింది లక్నో యాజమాన్యం. ఈ సందర్భంగా ఆ టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ.. పంత్ పుట్టుకతోనే లీడర్ అని మెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో బెస్ట్ కెప్టెన్‌గా అతడు కెరీర్‌ను ముగిస్తాడని జోస్యం పలికాడు. ఒకవైపు పంత్‌కు కెప్టెన్సీ, మరోవైపు ఓనర్ మాటలు, అటు టీమ్ కూడా బలంగా ఉండటంతో లక్నో ఈసారి కప్పుపై కర్చీఫ్ వేసినట్లు కనిపిస్తోందని నెటిజన్స్ అంటున్నారు.
ఇవీ చదవండి:
బుమ్రాకు సారీ చెప్పిన స్టార్ సింగర్
నీరజ్ చోప్రా పెళ్లి వేడుక పిక్స్ వైరల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి