Sanju Samson: సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది
ABN , Publish Date - Jan 29 , 2025 | 04:33 PM
Sanju Samson Plastic Ball Practice: టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఇందులో నుంచి బయటపడేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఏదీ వర్కౌట్ కావడం లేదు.

బ్యాటర్ల కెరీర్ స్పాన్ పెద్దగా ఉంటుంది. హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ సరిగ్గా ఉన్నన్ని రోజులు వాళ్లు గేమ్‌లో కంటిన్యూ అవ్వొచ్చు. అయితే కెరీర్ పొడిగించుకోవాలంటే ఎప్పటికప్పుడు తప్పుల్ని సరిదిద్దుకుంటూ ఉండాలి. బలహీనతలను అధిగమిస్తూ పోతేనే సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగొచ్చు. ఒకవేళ వీక్‌నెస్‌ను దాటడంలో ఫెయిలైతే మాత్రం కెరీర్ క్లోజ్ అనే చెప్పాలి. టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఒక షాట్ అతడి ఖేల్ ఖతం చేసేలా కనిపిస్తోంది. మరి.. ఏంటా షాట్? అనేది ఇప్పుడు చూద్దాం..
టార్గెట్ చేసి మరీ..!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ దారుణంగా విఫలమవుతున్నాడు. మెరుపు ఆరంభాలతో అపోజిషన్ టీమ్‌ను బ్యాక్ సీట్‌లోకి నెట్టే సంజూ.. ఇప్పుడు బంతిని బాదలేక చేతులెత్తేస్తున్నాడు. షార్ట్ పిచ్ డెలివరీస్‌తో అతడి పని పడుతున్నారు ఇంగ్లండ్ బౌలర్లు. 26, 5, 3.. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో విధ్వంసక ఓపెనర్ బ్యాట్ నుంచి వచ్చిన పరుగులు ఇవి. షార్ట్ పిచ్ బంతులతో ఈ మూడుమార్లూ అతడ్ని దొరకబుచ్చుకున్నాడు జోఫ్రా ఆర్చర్. ఆఫ్ సైడ్‌లో మిడిల్ లెంగ్త్‌లో సంజూ తలను టార్గెట్ చేసుకొని బౌన్సర్లు వేసి ఫలితం రాబడుతున్నాడు ఇంగ్లీష్ పేసర్.
ఆర్చర్ ఉచ్చుకు బలి!
ఆర్చర్ వేస్తున్న బౌన్సర్లను అటు డిఫెన్స్ చేయలేక ఇటు షాట్స్‌గా మలచలేక వికెట్ పారేసుకుంటున్నాడు సంజూ. బ్యాట్ ఝళిపించడానికి కావాల్సిన ఎలివేషన్ దొరక్కపోవడం, బ్యాట్ ఊపేందుకు అవకాశం ఇవ్వకుండా టార్గెట్ చేసి బంతులు వేయడంతో అతడికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ వైఫల్యం నుంచి బయటపడేందుకు సిమెంట్ పిచ్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాడట సంజూ. ప్లాస్టిక్ బాల్‌తోనూ సాధన చేస్తున్నాడట. అయితే అతడు ఇలాగే ఫెయిలైతే ఓపెనర్ బెర్త్ పోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వరుస చాన్సుల్ని మిస్ చేసుకుంటే పర్మినెంట్ ప్లేస్ కాదు కదా.. ఉన్న స్థానం కూడా పోతుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ హెచ్చరిస్తున్నారు. షాట్ బాల్‌ను బౌండరీలకు తరలించే పుల్ షాట్‌ను అతడు సరిగ్గా వాడకపోతే అతడి కెరీర్ ఫినిష్ అవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. మరి.. చివరి రెండు టీ20ల్లోనైనా ఈ బలహీనతను శాంసన్ అధిగమిస్తాడేమో చూడాలి.
ఇవీ చదవండి:
అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య
టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య
ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్‌రౌండర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి