Share News

KTR: సీఎం రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకాలు మొదలుపెట్టారు.. కేటీఆర్ విసుర్లు

ABN , Publish Date - Jan 17 , 2025 | 09:11 AM

KTR: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను ఇచ్చి పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు.

KTR: సీఎం రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకాలు మొదలుపెట్టారు.. కేటీఆర్ విసుర్లు
KTR

హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కొత్త నాటకం మొదలు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) ఆరోపించారు. తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా రేవంత్ వైఖరీ ఉందని ఆక్షేపించారు. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి- ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్విట్ చేశారు.


హామీల అమల్లో విఫలం..

‘‘తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన - ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేశి. ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికి ? -గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి ? నెలకు రూ.2500 ఇస్తున్న మహిళలు ఎవరు ? - తులం బంగారం ఇచ్చిన ఆడబిడ్డలు ఎవరు..? రైతుభరోసా రూ.7500 ఇచ్చిందెక్కడ.. ? - ఆసరా ఫించన్లు రూ.4000 చేసిందెక్కడ..? రూ.5 లక్షల విద్యాభరోసా ఎక్కడ..? విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎక్కడ..? పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా ఇక్కడ హామీలకు దిక్కులేదు గాని అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నారు. ఈడ ఇచ్చిన హామీలకు దిక్కు లేదు.. ఢిల్లీలో ఇస్తున్న హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా..? ఢిల్లీ గల్లీల్లో కాదు దమ్ముంటే మీ ఢిల్లీ గులాంతో అశోక్‌నగర్ గల్లీల్లో చెప్పు ఉద్యోగాలు ఇచ్చామని నవ్విపోదురు గాక .. నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం’’ అని కేటీఆర్ విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి

High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

Seethakka: గురుకులాల భోజనం అమ్మ వంటను గుర్తుచేయాలి

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jan 17 , 2025 | 09:59 AM