Uttam Kumar Reddy: రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
ABN , Publish Date - Jan 20 , 2025 | 08:47 PM
Minister Uttam Kumar Reddy: కొత్త రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైషన్ కార్డుల గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్: రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.తాము అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. అప్పుడు బీఆర్ఎస్ మోసం చేసిందని.. ఇప్పుడు తాము ఇస్తుంటే అడ్డుకుంటున్నారని విరుచుకుపడ్డారు. జాబితాలో పేర్లు రాని వాళ్లు ప్రజావాణి, గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి కాగానే ప్రతీ వ్యక్తికి 6కిలోల సన్నబియ్యం ఇవ్వబోతున్నామని ప్రకటించారు. కొత్త రేషన్ కార్డులపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దేనిపై విమర్శలు చేయాలో తెలియక ప్రజల్లో పలుచన అవుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 40 వేలకు మించి రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
సన్న బియ్యం పంపిణీ వల్ల రూ.11వేల కోట్ల భారం తమ ప్రభుత్వంపై పడుతుందని అన్నారు. ట్రిబ్యునల్ తీర్పుపై హరీష్‌రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కృష్ణ జలాల్లో 299 టీఎంసీలను తెలంగాణకు అంగీకరిస్తూ కేసీఆర్ - హరీష్ రావు సంతకాలు చేశారని గుర్తుచేశారు. పోతిరెడ్డి పాడు, రాయసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కళ్లు మూసుకున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో కృష్ణా జలాల నీటి వాటాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
KTR: అన్నీ కటింగ్‌లు.. కటాఫ్‌లే.. కేటీఆర్ విమర్శనాస్త్రాలు
Hyderabad: నాలుగు రాష్ట్రాల పోలీసులకు సవాల్ చేస్తున్న దొంగల ముఠా..
Davos: సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన
Read Latest Telangana News And Telugu News