Revanth Reddy: ఆర్థికాభివృద్ధే మహిళా సమాఖ్య లక్ష్యం
ABN , Publish Date - Feb 21 , 2025 | 03:55 PM
Revanth Reddy: ఆర్థికాభివృద్ధే మహిళా సమాఖ్య లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

నారాయణపేట: అన్నిరంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. నారాయణపేటలో ఇవాళ(శుక్రవారం) మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశంలోనే మొదటిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతారని తమ ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతోందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
ALSO READ: Kishan Reddy: అవినీతికి పెద్దపీట వేశారు.. సీఎం రేవంత్‌పై కిషన్‌రెడ్డి ఫైర్
మహిళలను కోటీశ్వరులను చేస్తాం..
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో మహిళా శక్తి 67 లక్షల మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. 600 ఆర్టీసీ బస్సులకూ మహిళలను యజమానులను చేశామని గుర్తుచేశారు. వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. మహిళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి శిల్పారామం వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి ఇచ్చామన్నారు. త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇవ్వనున్నామని ప్రకటించారు. సొంత ఆడబిడ్డలకు అందించినట్లు నాణ్యమైన చీరలను అందించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
పాఠశాలలపై ప్రత్యేక దృష్టి..
రూరల్, అర్బన్ అనే తేడా లేదు.. తెలంగాణలో మహిళలంతా ఒక్కటే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుందామని తెలిపారు. మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. నిధులు తాము ఇస్తాం.. నిర్వహణ మీరు చేయాలని అన్నారు. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటామో బడిని కూడా అలాగే నిర్వహించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...
Scandal Exposed: భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..
BJP: సికింద్రాబాద్‌లో బీజేపీ శ్రేణుల సంబురాలు..
Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట
Read Latest Telangana News and Telugu News