Nara Lokesh : జబర్దస్త్ ఆంటీ తిరుమల దర్శనాలను అమ్ముకుంటోంది

ABN , First Publish Date - 2023-02-27T13:15:23+05:30 IST

తన గొంతు నొక్కాలని మైక్ పెరుక్కుంటున్స్ సీఎం జగన్ కు రివర్స్ ఆఫర్ ఇస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.

Nara Lokesh : జబర్దస్త్ ఆంటీ తిరుమల దర్శనాలను అమ్ముకుంటోంది

తిరుపతి : తన గొంతు నొక్కాలని మైక్ పెరుక్కుంటున్స్ సీఎం జగన్ కు రివర్స్ ఆఫర్ ఇస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. చంద్రగిరి దొండవాడ వద్ద నారా లోకేష్ బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ.. ‘నా మైకును నేనే స్వచ్ఛందంగా సరెండర్ చేస్తా... జగన్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు ఇస్తాడా? జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాడా? 45 సంవత్సరాల నిండిన బీసీ ఎస్టీ ఎస్సీలకు పెన్షన్ ఇస్తాడా? ఇస్తానంటే నా మైకు సరెండర్ చేస్తా’ అని తెలిపారు.

జగన్ జలగలాంటివాడని.. జలగ రక్తం పిలిచినట్టే నిత్యావసర వస్తువులు పెట్రోల్ డీజిల్ అన్ని ధరలు పెంచి పీల్చేస్తున్నాడని నారా లోకేష్ విమర్శించారు. వలంటీర్లను పంపి ఎంత గాలి పీలుస్తున్నారో కొలిచి, మనం పీల్చే గాలికి కూడా పన్ను విధించగలిగినవాడు జగన్ అని పేర్కొన్నారు. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి పూలాభిషేకం చేసిన వైసీపీ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగదన్నారు. జగన్ ది దరిద్రపుగొట్టు పాదమని.. ఆయన ప్రభుత్వంలోకి రాగానే బోటు ప్రమాదంలో 51 మంది.. ఎల్‌జీ పాలిమార్‌లో పదిమంది అన్నమయ్య డ్యాంలో 62 మంది ప్రాణాలు కొట్టుకు పోయాయని నారా లోకేష్ ఆరోపించారు.

రాయలసీమకు పట్టిన శని జగన్ అని నారా లోకేష్ విమర్శించారు. అప్పర్ తుంగభద్ర కడితే రాయలసీమ రాళ్ల సీమవుతుందని.. అయినా ఇక్కడ వైసీపీ ఎంపీలు ఢిల్లీలో నోరు మెదపడం లేదన్నారు. జగన్ టీటీడీ పాలకమండలి సభ్యుల పదవులను అమ్ముకుంటే, జబర్దస్త్ ఆంటి రోజా, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మంత్రి నారాయణస్వామి తిరుమల దర్శనాన్ని అమ్ముకుంటున్నారన్నారు. దేశంలోని టీటీడీ ఆస్తుల్ని అమ్మేయాలని జగన్ కుట్ర చేశాడన్నారు. తిరుమలలో గంజాయి దొరకడమేంటి?.. అసలు తిరుమలని ఎక్కడికి తీసుకుపోతున్నారని ప్రశ్నించారు. ‘తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్నాను నాకు నా కుటుంబానికి వివేకానంద రెడ్డి హత్యతో సంబంధం లేదు. ఇదే విధంగా జగన్ కూడా వెంకటేశ్వర స్వామి సాక్షిగా వివేకానంద రెడ్డి హత్యతో సంబంధం లేదని ప్రమాణం చేయగలడా?’ అని నారా లోకేష్ నిలదీశారు.

Updated Date - 2023-02-27T13:25:13+05:30 IST