Kiran Kumar Reddy: ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు.. కిరణ్ కుమార్ రెడ్డి నెక్ట్స్ స్టెప్ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-03-11T10:15:07+05:30 IST

ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీని వీడనున్నారు. గత కొంత కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

Kiran Kumar Reddy: ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు.. కిరణ్ కుమార్ రెడ్డి నెక్ట్స్ స్టెప్ ఏంటంటే..

అమరావతి : ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీని వీడనున్నారు. గత కొంత కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తిరిగి ఆయన యాక్టివ్ పొలిటిక్స్‌లోకి రావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరనున్నట్టు తెలుస్తోంది. నేడు హైదారాబాద్ కు బీజేపీ అగ్రనేత అమిత్ షా రానున్నారు. ఆయన సమక్షంలోనే కిరణ్ కుమార్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు.

ఈ రాత్రికి లేదా రేపు ఉదయం హైదరాబాద్‌లో అమిత్ షాతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం బీజేపీలో చేరనున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీలో ఏ పదవి ఇస్తారనేది సైతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏపీ బీజేపీ వ్యవహారాలు అప్పగించే అవకాశం ఉందనే టాక్ కూడా నడుస్తోంది.

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టారు. ఎందుకో కానీ ఆ పార్టీ అంతగా ఆదరణకు నోచుకోలేదు. దీంతో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరినా ఎప్పుడూ కూడా యాక్టివ్‌ పార్ట్ అనేది తీసుకోలేదు. ఇప్పుడు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాయలసీమలో తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు బీజేపీ సైతం ఆయనను ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2023-03-11T10:15:07+05:30 IST