Bhuma Akhilapriya హౌస్ అరెస్ట్... ఆళ్లగడ్డలో టెన్షన్
ABN , First Publish Date - 2023-02-04T09:21:16+05:30 IST
టీడీపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్టుతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
నంద్యాల: టీడీపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియ (Former Minister Bhuma Akhilapriya) హౌస్ అరెస్టుతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆళ్ళగడ్డలోని భూమా అఖిలప్రియ (TDP Former Minister) ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు నంద్యాలలోని గాంధీ చౌక్ వద్ద ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి (YCP MLA Shilpa RaviChandraKishore Reddy) అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతానని మాజీ మంత్రి సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అఖిలప్రియ (TDP Leader)ను నంద్యాల వెళ్లకుండా ఆళ్ళగడ్డలోనే పోలీసులు గృహనిర్బంధం చేశారు. అనుమతి లేకుండా బహిరంగ చర్చకు ఏర్పాట్లు చేశారని భూమా అఖిలప్రియ ప్రైవేటు కార్యదర్శికి గత రాత్రి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
కాగా... నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి (Nandyala YCP MLA), భూమా అఖిలప్రియ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) చూపు టీడీపీ (TDP)వైపు ఉందంటూ రెండు రోజుల క్రితం భూమా అఖిలప్రియ మీడియా ముఖంగా తెలియజేయడం సంచలనం రేపుతోంది. శిల్పారవి టీడీపీ నాయకులతో టచ్‌లో ఉన్నారని తెలిసిందని... తెలుగుదేశంలో చేరేందుకు ప్లాట్‌ఫాం సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలో శిల్పా రవిచంద్రకిషోర్ అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానంటూ భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. 4న నంద్యాలలోని గాంధీచౌక్ వద్దకు ఎమ్మెల్యే అక్రమాల చిట్టా తీసుకువస్తానని... తాను అక్రమాలకు పాల్పడ్డానని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపించాలని, లేదంటూ క్షమాపణ చెప్పాలంటూ అఖిలప్రియ డిమాండ్ చేశారు. భూమా అఖిలప్రియ సవాల్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ మంత్రిని నంద్యాలకు రానీయకుండా ఆళ్లగడ్డలో హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుపై భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.