Kala Venkata Rao: జగన్ అధికారంలోకి వచ్చాకే విద్యుత్ కోతలు
ABN , First Publish Date - 2023-09-02T16:13:28+05:30 IST
రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన సాగుతోందని.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM JAGAN) అధికారంలోకి వచ్చిన తర్వాతే విద్యుత్ కోతలు అధికమయ్యాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు కళావెంకటరావు (K Kala Venkata Rao)అన్నారు.
శ్రీకాకుళం: రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన సాగుతోందని.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM JAGAN) అధికారంలోకి వచ్చిన తర్వాతే విద్యుత్ కోతలు అధికమయ్యాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు కళావెంకటరావు (K Kala Venkata Rao)అన్నారు.శనివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు ప్రారంభమయ్యాయి.జగన్ ఏపీకి పట్టిన గ్రహణం.జగన్ పాదం ఏమి పాదమో తెలియదు. ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో విద్యుత్ కష్టాలు ఎప్పుడూ చూడలేదు.రైతులకు 24 గంటల విద్యుత్ అన్నాడు. తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు వస్తే తెలుస్తుంది.రైతులకు ఎందుకు విద్యుత్ ఇవ్వలేకపోతున్నారో జగన్ సమాధానం చెప్పాలి.
సెప్టెంబర్ మొదటి వారంలో విద్యుత్ కోతలు ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలి. టీడీపీ హయాంలో 24 గంటలు నిరంతర విద్యుత్ అందించాం.విద్యుత్ శాఖామంత్రి మైనింగ్‌లో బిజీగా ఉన్నారు.విద్యుత్ విషయంలో ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేదు.జగన్‌ను ఎన్నుకున్నందుకు ప్రజలకు తిప్పలు తప్పటం లేదు.2014-19 మధ్య ఒక్క గంట కూడా విద్యుత్ అంతరాయం కలగలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రాష్ట్రానికి పట్టిన గ్రహణం పోవాలంటే జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలి.జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనుకకు పోయింది’’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.