BJP MP GVL: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-09-26T20:52:57+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌(Visakha Steel Plant)పై బీజేపీ ఎంపీ జీవీఎల్‌(BJP MP GVL) కీలక వ్యాఖ్యలు చేశారు.

BJP MP GVL: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కీలక వ్యాఖ్యలు

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌(Visakha Steel Plant)పై బీజేపీ ఎంపీ జీవీఎల్‌(BJP MP GVL) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు విశాఖలో జీవీఎల్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఇప్పుడప్పుడే జరగదు. స్టీల్‌ప్లాంట్‌ను లాభసాటిగా నడిపించాలనేదే మా ప్రయత్నం. స్టీల్‌ప్లాంట్‌ సంబంధిత అంశాలపై పార్లమెంట్‌లో ప్రశ్నించాం. 10 నుంచి 15 ప్రశ్నలను నేనే అడిగాను. ప్లాంట్కు అవసరమయ్యే ఐరన్ ఓర్ కోసం.. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు?. స్టీల్‌ప్లాంట్‌ను యాజమాన్యం పట్టించుకోలేదు. లాభాల్లో ఉందనేది వాస్తవం కాదు. గతంలో ఎన్నో తప్పిదాలు జరిగాయి. మోదీ ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఒక ట్రాక్‌లో పెడతాం’’ అని ఎంపీ జీవీఎల్‌ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-26T20:52:57+05:30 IST