Chinarajappa: వరద బాధితులను జగన్ పట్టించుకోవట్లేదు
ABN , First Publish Date - 2023-08-05T19:39:48+05:30 IST
తెలుగుదేశం(Telugu Desham) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ఆదేశాల మేరకు విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినట్లు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప(Chinarajappa) తెలిపారు.
అల్లూరి జిల్లా: తెలుగుదేశం(Telugu Desham) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ఆదేశాల మేరకు విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినట్లు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప(Chinarajappa) తెలిపారు. విలీన మండలాల్లోని వరద బాధితులను జగన్(jagan) పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు వైసీపీ మంత్రులు(YSP Ministers) వరద ప్రాంతాల్లో పర్యటించలేదని చినరాజప్ప అన్నారు.
ఆ విషయంలో జగన్ ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదు: జ్యోతుల నెహ్రూ
వరద బాధితులను(Flood victims) ఆదుకోవటంలో జగన్ ప్రభుత్వానికి(Jagan Govt) ఎలాంటి ప్రణాళిక లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ(Jyotula Nehru) అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించటంలో జవాబుదారీతనం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram project) నిర్వాసితులకు 45వ కాంటూరు వరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని దుయ్యబట్టారు. వరదల్లో ఆశ్రయం కోల్పోయిన విలీన మండలాల ప్రజలకు నిత్యావసర వస్తువులు, బియ్యం ఉచితంగా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు.