Ayodhya Ram Temple : రామ భక్తులకు శుభవార్త చెప్పిన అమిత్ షా

ABN , First Publish Date - 2023-01-05T18:30:11+05:30 IST

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గురువారం రామ భక్తులకు శుభవార్త చెప్పారు. శ్రీరాముని జన్మ స్థలం అయోధ్యలో రామాలయం

Ayodhya Ram Temple : రామ భక్తులకు శుభవార్త చెప్పిన అమిత్ షా
Ayodhya Ram Temple

న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గురువారం రామ భక్తులకు శుభవార్త చెప్పారు. శ్రీరాముని జన్మ స్థలం అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ తేదీని వెల్లడించారు. త్రిపుర శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, రామాలయం ప్రారంభోత్సవం 2024 జనవరి 1న జరుగుతుందని చెప్పారు.

రామాలయం నిర్మాణాన్ని కోర్టుల ద్వారా కాంగ్రెస్ (Congress) అడ్డుకుందని చెప్పారు. రామాలయం (Ram Temple) నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ నిర్మాణాన్ని ప్రారంభించారని తెలిపారు.

ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) గత నవంబరులో మాట్లాడుతూ, రామాలయం నిర్మాణం సగం పూర్తయిందని, 2023 డిసెంబరునాటికి భక్తుల పూజలకు సిద్ధమవుతుందని తెలిపారు.

రామాలయం నిర్మాణం కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. రెండు అంతస్థులతో దీని నిర్మాణం జరుగుతోంది. దీనిలో ఐదు మండపాలు ఉంటాయి. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రదర్శనశాల, గత కాలపు వస్తువులు, పుస్తకాలు వంటివాటిని ప్రదర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అర్చకుల కోసం ప్రత్యేకంగా గదులను నిర్మిస్తున్నారు.

రామాలయానికి సమీపంలోని కుబేర్ తిల, సీతా కూపం వంటివాటిని కూడా వారసత్వ కట్టడాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2023-01-05T18:30:15+05:30 IST