YSRCP : ఓరి బాబోయ్.. సీఎం వైఎస్ జగన్ గురించి ఉండవల్లి శ్రీదేవి ఏమన్నారో చూడండి.. వీడియోలు నెట్టింట్లో వైరల్..

ABN , First Publish Date - 2023-03-25T21:27:16+05:30 IST

ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి (YSR Congress) ఊహించని షాక్ తగిలిన విషయం విదితమే. అసలు అభ్యర్థే నిలబడరన్న స్థాయి నుంచి..

YSRCP : ఓరి బాబోయ్.. సీఎం వైఎస్ జగన్ గురించి ఉండవల్లి శ్రీదేవి ఏమన్నారో చూడండి.. వీడియోలు నెట్టింట్లో వైరల్..

ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి (YSR Congress) ఊహించని షాక్ తగిలిన విషయం విదితమే. అసలు అభ్యర్థే నిలబడరన్న స్థాయి నుంచి.. పంచుమర్తి అనురాధను (Panchumarthi Anuradha) అభ్యర్థిగా బరిలోకి దింపి, పక్కా వ్యూహాలు రచించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు (TDP Chief Chandrababu) గెలిపించుకున్నారు. బహుశా ఇలా జరుగుతుందని కానీ.. అధికారంలో ఉండి క్రాస్ ఓట్లు పడతాయని కానీ వైసీపీ పెద్దలు ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) కలలో కూడా ఊహించి ఉండరేమో. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (MLA Vundavalli Sridevi) , ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) టీడీపీ అభ్యర్థికే ఓట్లేశారని.. ఇది పార్టీ లైన్ దాటడమే అని నిర్ధారించిన అధిష్ఠానం ఈ ఇద్దర్నీ వైసీపీ సస్పెండ్ చేసింది. అంతేకాదు వీరితో పాటు ఇదివరకే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) , కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని (Kotam Reddy Sridhar Reddy) కూడా వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేసేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. సస్పెండ్ తర్వాత ఎమ్మెల్యేలు.. వైసీపీ అధిష్ఠానం, సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మేకపాటి, శ్రీధర్ రెడ్డి.. జగన్‌పై తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేయగా ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్కే అయ్యింది. మరోవైపు. ఒకప్పుడు ఇదే జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన వీడియోలను సైతం మరోసారి అభిమానులు, కార్యకర్తలు, నెటిజన్లు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా మీమర్స్‌కు అయితే ఇక మీమ్స్‌కు (Memes) కొదువే లేకుండా పోయింది.

4-MLAs-Suspension.jpg

అప్పట్లో మామూలుగా లేదుగా..!

గతంలో తాడికొండలో జరిగిన ఓ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో వేదికపై నాటి మంత్రులు పేర్ని నాని (Perni Nani), బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) ఇద్దరూ కూర్చొని ఉన్నారు. ఈ ఇద్దరు మంత్రుల మధ్యలో వైఎస్ జగన్ కూర్చున్నారు. ప్రసంగించడానికి శ్రీదేవి వంతు రానే వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాలు, నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడతారేమో అని అందరూ అనుకున్నారు కానీ.. జగన్ భజన ప్రారంభించారు. ఆహా.. ఓహో.. జగన్ అంటే ఇదీ.. అంటూ సీఎంను ఆకాశానికెత్తేశారు. ఆమె మాట్లాడుతున్నంత సేపు వేదికపై ఉన్న సీఎం, మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు అంతా పగలబడి నవ్వుకున్నారు. మరోవైపు.. సభకు హాజరైన కార్యకర్తలు, వీరాభిమానులు.. ఇతర నేతలు ఈలలు, కేకలు.. నినాదాలతో హోరెత్తించారు.

Vundavalli-and-Mekapati.jpg

పులివెందుల అని ఇందుకే..!

సన్‌రైజింగ్ స్టేట్‌లో సన్‌రైజింగ్ సీఎం (Sun Rising CM). బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. నేడు మగధీరుడు. నిరంతర శ్రామికుడు.. అలుపెరగని వీరుడు జగనన్న. జయహో జగనన్న. పులివెందులకు (Pulivendula) ఆ పేరు ఎందుకొచ్చింది.. జగనన్న (Jagananna) పులివెందులలో ఎందుకు ఇంత మహానుభావులు పుట్టారనే అనుకుంటే నాకు ఇప్పుడు తెలుస్తోంది. అన్యాయానికి ఎదురునిలబడే వ్యక్తులు, న్యాయానికి ఊపిరిపోసే వ్యక్తులు, పేదవారికి సహాయం చేసే వ్యక్తులు, మహిళలకు అండగా ఉండే వ్యక్తులు, పులిలాగా ఎవరికీ రాజీపడని వ్యక్తులు గనుక ఆ ప్రాంతం పులివెందుల అయ్యింది. ఆ నాడు రాజారెడ్డిగారు (YS Raja Reddy), మొన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు (YS Rajasekhar Reeddy) ఇప్పుడు కార్యకర్తల కన్నీరు తుడిచే వైఎస్ జగనన్న గారు ఈ పులి లాంటి వ్యక్తి ముందే పుడతారని తెలిసి ఆ ఏరియాకు పులివెందుల అని పేరుపెట్టారని తెలుస్తోందిఅని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సభావేదికగా మాట్లాడారు.

శ్రీదేవి తన గురించి మాట్లాడుతుంటే జగన్ అయితే నవ్వు ఆపుకోలేక.. ఉప్పొంగిపోయారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ శ్రీదేవినే జగన్‌కు వెన్నుపోటు పొడిచారని కార్యకర్తలు, వీరాభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలా ఈ ఒక్క వీడియోనే కాదు.. ‘నా గుండె జగన్.. జగన్ అని కొట్టుకుంటోంది’ అంటూ శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు అప్పట్లోనే ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ భజనం చేయడంలో అప్పట్లో శ్రీదేవి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందని సొంత పార్టీ నేతలే అప్పట్లో చెప్పుకున్నారు.ఇప్పుడు శ్రీదేవి వీడియో సోషల్ మీడియాలో (Socail Media) ఎక్కడ చూసినా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై వైసీపీ కార్యకర్తలు, జగన్ ఫ్యాన్స్ (YS Jagan Fans) అయితే ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు.. కొందరు అభిమానులు అయితే వాట్సాప్ స్టేటస్‌లు పెట్టి మరీ శ్రీదేవిని ఓ రేంజ్‌లో విమర్శిస్తున్నారు. ఈ విమర్శలకు శ్రీదేవి వర్గం.. ఎమ్మెల్యే ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

****************************

ఇవి కూడా చదవండి

******************************

Kotam Reddy : వైఎస్ జగన్‌తో ఎక్కడ చెడింది.. 20 కోట్ల వ్యవహారమేంటి.. వైసీపీని వీడే ఎమ్మెల్యేల గురించి పూసగుచ్చినట్లుగా చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..!

******************************

AP Politics : ఏపీలోని ఆ జిల్లాలో ముసలం పుడితే.. అధికార పార్టీ అడ్రస్ గల్లంతే.. ఒక్కసారి చరిత్ర చూస్తే...

******************************

YSRCP : ఉండవల్లి, మేకపాటిపై వేటు వేసే పరిస్థితి ఎందుకొచ్చింది.. ఓటింగ్‌కు ముందు జగన్‌తో భేటీ.. ఆ అరగంటలో ఏం జరిగింది.. ఒక్క మాటతో..!

******************************

Suspension on 4 MLAs : వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడిన నిమిషాల వ్యవధిలోనే జరిగిన సీన్ ఇదీ.. నిరూపిస్తారా..!

******************************

Big Breaking : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్

******************************

MLC Election Results : క్రాస్ ఓటింగ్ వేసిందెవరో తెలుసన్న సజ్జల.. ఎమ్మెల్యే శ్రీదేవి రియాక్షన్ ఇదీ.. ఇవాళ ఉదయమే...

******************************

MLC Election Results : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌కు వెన్నుపోటు పొడిచింది ఈ ఇద్దరు ఎమ్మెల్యేలేనా.. ఫోన్ స్విచాఫ్ రావడంతో...!


******************************

Updated Date - 2023-03-25T21:47:03+05:30 IST