Apple BKC Store: 'యాపిల్' బాస్‌నే సర్‌ప్రైజ్ చేసిన అభిమాని.. సింప్లీ సూపర్బ్ అంతే..!
ABN , First Publish Date - 2023-04-18T16:25:51+05:30 IST
భారత్‌లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్ (Apple First Retail Store) ప్రారంభమైంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్ (Apple First Retail Store) ప్రారంభమైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బాంద్రా కూర్ల కాంప్లెక్స్‌లో 'యాపిల్ బీకేసీ' (Apple BKC) పేరిట ఈ స్టోర్‌ను ప్రారంభించారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) స్వయంగా స్టోర్ తలుపులు తెరిచి కస్టమర్లను ఆహ్వానించారు. ఈ స్టోర్‌లో యాపిల్ ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేయొచ్చు. ఇండియాలో తన బిజినెస్ కార్యాకలాపాలను శరవేగంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా యాపిల్.. రిటైల్ స్టోర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ నెల 20న ఢిల్లీలో రెండో యాపిల్ స్టోర్‌ను తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. 'యాపిల్ సాకేత్' (Apple Saket) పేరుతో ఢిల్లీలో రెండో యాపిల్ రిటైల్ స్టోర్ తెరవనుంది.
ఇక ముంబైలో యాపిల్ రిటైల్ స్టోర్ అందుబాటులోకి రావడంతో స్టోర్‌ను చూడటానికి, అందులోని ఉత్పత్తులను కొనగోలు చేసేందుకు యాపిల్ అభిమానులు 'యాపిల్ బీకేసీ' స్టోర్ ముందు బారులు తీరారు. అయితే, ఓ అభిమాన మాత్రం ఏకంగా టిమ్ కుక్‌నే సర్‌ప్రైజ్ చేశాడు. 1984లో అందుబాటులోకి తెచ్చిన మొదటి యాపిల్ కంప్యూటర్ వెర్షన్ మాకింతోష్ కంప్యూటర్‌ను (Macintosh Classic Machine) తీసుకువచ్చాడు. అది చూసిన యాపిల్ బాస్ ఆ కస్టమర్‌ను అప్యాయంగా హత్తుకున్నారు. అభిమాని తెచ్చిన ఆ కంప్యూటర్‌ను చూస్తూ 'వావ్' అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
Viral Video: రైల్లో ఓ వృద్ధ జంట ప్రయాణం.. భర్త చేసిన పనిని దూరం నుంచి సీక్రెట్‌గా వీడియో తీశాడో ప్రయాణీకుడు.. నెట్టింట పోస్ట్ చేస్తే..
"నేను తొలిసారి 1984 యాపిల్ కంప్యూటర్ కొనుగోలు చేశాను. అప్పటి నుంచి యాపిల్ ఉత్పత్తులనే వాడుతున్నాను. ఇదిగో దీని డిస్క్‌స్టోరేజ్ కెపాసిటీ 2 మెగాబైట్స్. బ్లాక్ అండ్ వైట్ కలర్ వేరియంట్స్‌లో ఉంది. ఇప్పుడు ఇదే కంప్యూటర్‌ను యాపిల్ 4కే, 8కే రిజల్యూషన్ డిస్‌ప్లేలను తయారు చేస్తోంది" అని ఆ అభిమాని చెప్పుకొచ్చారు. ఇక యాపిల్ ఫ్యాన్ తన వెంట తీసుకొచ్చిన యాపిల్ పాత కంప్యూటర్‌ను టిమ్ కుక్‌కు చూపించడం.. ఆ కంప్యూటర్‌ను చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో సినిమా, క్రికెట్ స్టార్లకే కాదు ఎలక్ట్రానిక్స్ వస్తువులకు ఫ్యాన్స్ ఉంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.